సౌదీలో హజ్ సీజన్ ఉద్యోగాలు: భారతీయులకు అవకాశం, వెంటనే అప్లై చేయండి
హజ్ సీజన్ 2023 కోసం పలు పోస్టుల భర్తీకి జెడ్డాలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
రియాద్/హైదరాబాద్: హజ్ సీజన్ 2023 కోసం పలు పోస్టుల భర్తీకి జెడ్డాలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, క్లార్క్స్, మేసేంజర్ల పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరింది. టెంపరరీ బేసిస్‌పై ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
18 ఏళ్లకు పైబడినవారు ఈ ఉద్యోగాల కోసం ఫిబ్రవరి 28, 2023లోగా దరఖాస్తు చేసుకోవాలి.
అర్హులైన అభ్యర్థులు అవసరమైన పత్రాలతో.. Haj Section, Consulate General of India, P.O.Box.No. 952, Jeddah-21421. ఈ చిరునామాకు దరఖాస్తులు సమర్పించాలి.

మక్కా, మదీనాలలో నివసించేవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతోంది.
పే స్కేల్:
డేటా ఎంట్రీ ఆపరేటర్లకు: నెలకు 3600 సౌదీ రియల్స్(రూ. 79,622)
డ్రైవర్లు: నెలకు 2880 సౌదీ రియల్స్ (రూ. 63,697)
మేసేంజర్లు: నెలకు 1980 సౌదీ రియల్స్ (రూ. 43,792)
అర్హతలు:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉన్న అభ్యర్థులు, ఒక భారతీయ భాషతో పాటు అరబిక్ భాషలో పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న అభ్యర్థులకు క్లర్క్‌ల పోస్ట్‌కు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి కంప్యూటర్ అప్లికేషన్‌లో డిప్లొమా/సర్టిఫికేట్ కలిగి ఉన్నవారు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు ప్రాధాన్యత ఉంటుంది.
డాక్యుమెంట్స్:
పాస్‌పోర్ట్ ఫొటో కాపీలు
ఇఖామా
స్పాన్సర్ నుంచి నో అబ్జెక్చన్ లేటర్(ఒరిజినల్)
రెండు రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను కూడా అప్లికేషన్‌తో జతచేయాలి
పైన పేర్కొన్న పత్రాలు లేని దరఖాస్తులను తిరస్కరించడం జరుగుతుంది.
అప్లికేషన్ ఫాం కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications