నెలకు రూ.96 వేల జీతంతో తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు.. !!
తెలంగాణ హైకోర్టు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తంగా 859 ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనున్న ఈ నోటిఫికేషన్ నిరుద్యోగ యువతకు పెద్ద అవకాశంగా నిలుస్తోంది.
ఈ ఉద్యోగాల కోసం ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 24, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 24, 2026 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే స్వీకరించబడతాయి. పూర్తి అర్హతలు, సిలబస్, పరీక్ష విధానం వంటి వివరాల కోసం అభ్యర్థులు తెలంగాణ హైకోర్టు అధికారిక నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తున్నారు.

పోస్టులు & ఖాళీలు..
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 : 35
జూనియర్ అసిస్టెంట్ : 159
టైపిస్ట్ : 42
ఫీల్డ్ అసిస్టెంట్ : 61
ఎగ్జామినర్ : 49
కాపిస్ట్ : 63
రికార్డు అసిస్టెంట్ : 36
ప్రాసెస్ సర్వర్ : 95
ఆఫీస్ సబార్డినేట్ : 319
విద్యార్హతలు..
పోస్టును బట్టి అభ్యర్థులు
7వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత కలిగి ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ వంటి పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్/షార్ట్‌హ్యాండ్ స్కిల్స్ తప్పనిసరి.
వయోపరిమితి..
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వుడ్ కేటగిరీలకు వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు..
జనరల్, బీసీ అభ్యర్థులు: రూ.600
ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులు: రూ.400
ఫీజు ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలి.
ఎంపిక విధానం..
అభ్యర్థుల ఎంపిక కింది దశల ద్వారా జరుగుతుంది:
ఆన్‌లైన్ రాత పరీక్ష
సంబంధిత పోస్టులకు స్కిల్ టెస్ట్ / టైపింగ్ / షార్ట్‌హ్యాండ్ టెస్ట్
సర్టిఫికేట్ వెరిఫికేషన్
వేతన వివరాలు..
ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనాలు అందిస్తారు:
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3: రూ.32,810 - రూ.96,890
జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్: రూ.24,280 - రూ.72,850
ఎగ్జామినర్, కాపిస్ట్, ప్రాసెస్ సర్వర్: రూ.22,900 - రూ.69,150
రికార్డు అసిస్టెంట్: రూ.22,240 - రూ.67,300
ఆఫీస్ సబార్డినేట్: రూ.19,000 - రూ.58,850
ఇతర ముఖ్యాంశాలు..
ఈ ఉద్యోగాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి.
స్థిరమైన ఉద్యోగ భద్రత, పదోన్నతుల అవకాశాలు లభిస్తాయి.
మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు ప్రత్యేక అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications