పది పాసైతే చాలు.. భారీ జీతంతో తెలంగాణ హైకోర్టులో కొలువుల మేళా !
తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. తెలంగాణ హైకోర్టు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 43 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇందులో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 34, డ్రైవర్ పోస్టులు 9 ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
విద్యార్హతలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 7వ తరగతి లేదా పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. డ్రైవర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు డ్రైవింగ్ అనుభవం కూడా ఉండాలి. స్థానిక భాషపై అవగాహన, ప్రాథమిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

వయోపరిమితి..
- 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 46 ఏళ్లకు మించకూడదు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు - 5 ఏళ్ల సడలింపు
- పీడబ్ల్యూడీ అభ్యర్థులకు - 10 ఏళ్ల సడలింపు
- మాజీ సైనికులకు - ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది
దరఖాస్తు విధానం & చివరి తేదీ..
- అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి.
- దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమై ఉండగా ఫిబ్రవరి 28, 2026 చివరి తేదీగా నిర్ణయించారు.
- చివరి తేదీకి ముందే దరఖాస్తు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
దరఖాస్తు ఫీజు..
జనరల్, బీసీ అభ్యర్థులు - రూ.600
ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ, మాజీ సైనికులు - రూ.400
ఫీజును ఆన్‌లైన్ పేమెంట్ విధానంలో చెల్లించాలి.
ఎంపిక విధానం..
అభ్యర్థుల ఎంపికను రెండు దశల్లో నిర్వహిస్తారు:
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT)
స్కిల్ టెస్ట్ / డ్రైవింగ్ టెస్ట్ (డ్రైవర్ పోస్టులకు)
అభ్యర్థుల మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు..
- ఆఫీస్ సబార్డినేట్ - రూ.19,000 నుంచి రూ.58,850 వరకు
- డ్రైవర్ - రూ.22,900 నుంచి రూ.69,150 వరకు
ఇవి కాకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీఎ, హెచ్‌ఆర్‌ఏ, మెడికల్ సదుపాయాలు మరియు ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.
అదనపు సమాచారం..
రిజర్వేషన్ విధానం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమలు
ఎంపికైన వారికి స్థిర ఉద్యోగ భద్రత, పదోన్నతి అవకాశాలు
మహిళా అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు
పరీక్ష కేంద్రాలు తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసే అవకాశం
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications