ఇండియన్ ఆర్మీలో చేరండి: టెక్నికల్ గ్రాడ్యూయేట్ కోర్సు కోసం అప్లై చేయండి
న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.
ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉన్న అభ్యర్థులు ఇండియన్ ఆర్మీలో పర్మనెంట్ కమిషన్ కోసం డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ)లో జూలై 2022లో ప్రారంభమయ్యే 135వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ-135) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 6న ప్రారంభించబడింది. జనవరి 4, 2022న ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సంస్థలోని 40 పోస్టులను భర్తీ చేస్తుంది.
అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాలు:
అర్హతలు:
అవసరమైన ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులు లేదా ఇంజినీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సు చివరి సంవత్సరంలో చదువుతున్న అభ్యర్థులు జులై 1, 2022 నాటికి అన్ని సెమిస్టర్లు/సంవత్సరాల మార్కుషీట్‌లతో పాటు ఇంజినీరింగ్ డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన రుజువును సమర్పించాలి, శిక్షణ ప్రారంభించిన తేదీ నుంచి 12 వారాలలోపు ఇంగ్లీషు డిగ్రీ సర్టిఫికేట్‌ను సమర్పించాలి. ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ)లో శిక్షణ ఉంటుంది.
అభ్యర్థి వయస్సు పరిమితి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
కటాఫ్ మార్కుల ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. దరఖాస్తుల షార్ట్‌లిస్ట్ తర్వాత, సెంటర్ అలాట్‌మెంట్ అభ్యర్థికి వారి ఇమెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది. కటాఫ్ శాతాన్ని బట్టి షార్ట్‌లిస్ట్ చేయబడిన అర్హత గల అభ్యర్థులు మాత్రమే ఎంపిక కేంద్రాలలో ఒకదానిలో ఇంటర్వ్యూ చేయబడతారు.
అర్హత సాధించిన అభ్యర్థులందరూ వైద్య పరీక్షకు హాజరు కావాలి.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications