కర్ణాటక బ్యాంక్ అదిరిపోయే ఆఫర్.. ఎగ్జామ్ లేకుండానే జాబ్స్.. నేడే లాస్ట్ డేట్

నిరుద్యోగ అభ్యర్థులకు కర్ణాటక బ్యాంక్ తీపి కబురు ప్రకటించింది. ఎగ్జామ్ లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అయితే ఈరోజుతో దరఖాస్తులు పంపేందుకు గడువు ముగియనుంది. అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

నోటిఫికేషన్ పూర్తి వివరాలు..

మొత్తం ఖాళీలు..

75

విద్యార్హత..

ఉద్యోగాన్ని బట్టి విద్యార్హత ఉంటుందని తెలియజేశారు. ఐటీ స్పెషలిస్ట్ ఉద్యోగానికి బీఈ, ఎంసీఏ, ఎంటెక్, బీటెక్ లో ఐటీ పాసై ఉండాలి. అలానే చార్టెర్డ్ అకౌంటెంట్ ఉద్యోగానికి సీఏ పాసై ఉండాలి. మూడు అటెంప్ట్ లలోనే సీఏ పాసై ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇక లా ఆఫీసర్ పోస్టుకు ఎల్ఎల్ఎం పాసై ఉండాలి. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుకు ఎంబీఏ పాసై ఉండాలి.

karnataka-banks-amazing-offer-jobs-without-exam-today-is-the-last-date

పోస్టుల వారీగా ఖాళీలు..

ఐటీ స్పెషలిస్ట్ - 30 ఉద్యోగాలు

చార్టెర్డ్ అకౌంటెంట్ - 25

లా ఆఫీసర్ - 10

స్పెషలిస్ట్ ఆఫీసర్ - 10

ఎంపిక విధానం..

ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వేతనం..

ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఇస్తారు.

వయస్సు..

ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ణయించారు.

జనరల్ మేనేజర్ - 55 ఏళ్లు

డిప్యూటీ జనరల్ మేనేజర్ - 50 ఏళ్లు

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ - 45 ఏళ్లు

చీఫ్ మేనేజర్ - 40 ఏళ్లు

సీనియర్ మేనేజర్ - 25 నుంచి 38 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది..

2025 మార్చి 25

పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ https://karnatakabank.com/ ను చూడొచ్చు. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+