పోలీసు శాఖలో భారీ ఉద్యోగాలు: 4వేల పోస్టులకు అప్లయ్ చేయండి.. ఎక్కడ ఎలా అంటే..?
బెంగళూరు: కర్నాటక స్టేట్ పోలీస్ శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 4వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 మే 2021.
సంస్థ పేరు: కర్నాటక స్టేట్ పోలీస్ శాఖ
పోస్టు పేరు: కానిస్టేబుల్
పోస్టుల సంఖ్య: 4000
జాబ్ లొకేషన్: కర్నాటక
దరఖాస్తుకు చివరి తేదీ: 31 మే 2021
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి 12వ తరగతిలో ఉత్తీర్ణత
వయస్సు: 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఫిజికల్ టెస్టు మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
వేతనం: నెలకు రూ. 23500 - 47,650
అప్లికేషన్ ఫీజు:
జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు : రూ.250/-
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు : రూ.100/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 28 ఏప్రిల్ 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 మే 2021












Click it and Unblock the Notifications