ఫ్యాషన్ రంగంపై ఆసక్తి ఉందా.. "NIFT 2026" నోటిఫికేషన్ మీకోసమే !
మారుతున్న కాలానుగుణంగా ఫ్యాషన్ రంగం పట్ల కూడా యువత ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ తీపి కబురు ప్రకటించింది. యూజీ, పీజీ ఫ్యాషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం NIFT-2026 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఫ్యాషన్ రంగంలో స్థిరమైన, ప్రతిష్టాత్మక కెరీర్ కోరుకునే యువతకు ఇది మంచి అవకాశంగా నిలుస్తోంది.
దేశవ్యాప్తంగా నిఫ్ట్ కేంద్రాలు & సీట్ల వివరాలు..
కాగా నిఫ్ట్‌కు దేశవ్యాప్తంగా 20 కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. 2026 విద్యాసంవత్సరానికి యూజీ, పీజీ కోర్సులు కలిపి 5,000కు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సిలబస్, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ నిఫ్ట్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆ ఛాన్స్ సద్వినియోగం చేసుకోవచ్చు.

యూజీ కోర్సులు..
నిఫ్ట్‌లో నాలుగేళ్ల వ్యవధి గల యూజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో
- ఫ్యాషన్ డిజైన్
- టెక్స్‌టైల్ డిజైన్
- నిట్‌వేర్ డిజైన్
- యాక్సెసరీ డిజైన్
- లెదర్ డిజైన్
- కమ్యూనికేషన్ డిజైన్
- ఫ్యాషన్ టెక్నాలజీ (B.F.Tech)
పీజీ కోర్సులు..
రెండేళ్ల వ్యవధి గల పీజీ కోర్సుల్లో
- మాస్టర్ ఆఫ్ డిజైన్ (M.Des)
- మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ (MFM)
- మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (M.F.Tech)
అర్హతలు..
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అవసరం.
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ లేదా మూడేళ్ల డిప్లొమా అర్హత ఉండాలి.
పీజీ కోర్సులకు ఏదైనా డిగ్రీ లేదా నిఫ్ట్/నిడ్ నుంచి మూడేళ్ల యూజీ డిప్లొమా అర్హతగా ఉంటుంది.
M.F.Techకు నిఫ్ట్ B.F.Tech లేదా BE/B.Tech తప్పనిసరి.
వయోపరిమితి :
యూజీ అభ్యర్థుల వయసు ఆగస్టు 1, 2026 నాటికి 24 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5 ఏళ్ల వయో సడలింపు వర్తిస్తుంది.
పీజీ కోర్సులకు వయోపరిమితి లేదు. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ..
ఆన్‌లైన్ దరఖాస్తులకు జనవరి 6, 2026 చివరి తేదీ.
రూ.5,000 ఆలస్య రుసుముతో జనవరి 10, 2026 వరకు అప్లై చేసే అవకాశం ఉంది.
పరీక్ష ఫీజు..
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు: ఒక కోర్సుకు రూ.500, రెండు కోర్సులకు రూ.750
ఇతరులకు: ఒక కోర్సుకు రూ.2,000, రెండు కోర్సులకు రూ.3,000
ప్రవేశ పరీక్ష & ఎంపిక విధానం..
నిఫ్ట్ ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 8, 2026న నిర్వహించనున్నారు. పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగానే కౌన్సెలింగ్ ద్వారా సీట్లు కేటాయిస్తారు. కొన్ని కోర్సులకు క్రియేటివ్ టెస్ట్, ఇంటర్వ్యూ కూడా ఉంటాయి.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!












Click it and Unblock the Notifications