నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ఆగస్టు మొదటి వారంలో రిజిస్ట్రేషన్..
నీట్ అభ్యర్థులకు గమనిక.. నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధయ్యింది. ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం కానుందని నేషనల్ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ సమాచారమిచ్చింది. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ఆధ్వర్యంలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఈ నెల 29( సోమవారం)న ఒక ప్రకటన ఇచ్చింది. ఇతర పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు ఎంసీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరింది. ఆలిండియా కోటా 15 శాతం సీట్లతోపాటు సెంట్రల్ యూనివర్సిటీలు, ఎయిమ్స్, జిప్‌మెర్‌లోని ఎంబీబీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియను కూడా ఎంసీసీ నిర్వహించనున్నట్లు తెలిపింది.
నీట్ యూజీ 2024 పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు గత శుక్రవారం ఎన్‌టిఎ నీట్ యూజీ 2024 ఫైనల్ రిజల్స్ట్‌ను విడుదల చేసింది. ఇప్పడు తాజాగా ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 710 వైద్య కళాశాలల్లోని దాదాపు 1.10 లక్షల ఎంబీబీఎస్ సీట్ల ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. వీటితోపాటు 21,000 బీడీఎస్ సీట్లు ఉండగా, ఆయుష్, నర్సింగ్ సీట్లను కూడా ఈ సందర్భంగా భర్తీ చేయనున్నారు.

కౌన్సిలింగ్ షెడ్యూల్ వివరాలివే..
ఇందులో భాగంగానే ఆలిండియా కోటా సీట్ల భర్తీకి మొదటి రౌండ్ కౌన్సెలింగ్ ఆగస్టు 14వ తేది నుంచి 21వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. వచ్చే నెల 23వ తేదిన సీట్ల ఎంపిక వివరాలను ప్రకటిస్తారు. ఆగస్టు 24వ తేది నుంచి 29వ తేది లోపు కాలేజీల్లో చేరాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. ఇక, రెండో రౌండ్ సీట్ల భర్తీకి సెప్టెంబరు 5వ తేదిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 13న సీట్లకు ఎంపికైన వారి వివరాలను ప్రకటిస్తారు. అదే నెల 14వ తేది నుంచి 20 తేదిలోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. నీట్ యూజీ మూడో రౌండ్ కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబరు 16వ తేది నుంచి 20 తేది వరకు ఉంటుంది. సీట్ల కేటాయింపు అక్టోబరు 23న ఉంటుంది. అక్టోబర్ 24వ తేది నుంచి 30 తేదీలోపు విద్యార్థులు కళాశాలల్లో హాజరుకావాల్సి ఉంటుంది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications