రూ.2,09,200 జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు.. మరో ఐదు రోజులే గడువు !
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) దేశ వ్యాప్తంగా మంచి పేరు పొందాయి. గిరిజన ప్రాంతాల విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ పాఠశాలలను ఏర్పాటు చేసింది. వీటిలో ఆధునిక సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్య అందిస్తున్నారు.
ఈ మేరకు ఆయా స్కూల్స్ లో 7,267 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ కోసం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తులకు గడువు ప్రారంభం అవ్వగా.. అక్టోబర్ 23, 2025 తో ముగియనుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు..
7,267
పోస్టుల వివరాలు..
- ప్రిన్సిపల్ - 225
- పీజీటీ (Post Graduate Teacher) - 1,460
- టీజీటీ (Trained Graduate Teacher) - 3,962
- హాస్టల్ వార్డెన్ (Male) - 346
- హాస్టల్ వార్డెన్ (Female) - 289
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (Clerk) - 228
- అకౌంటెంట్ - 61
- స్టాఫ్ నర్స్ (Female) - 550
- ల్యాబ్ అటెండెంట్ - 146
విద్యార్హతలు..
- ప్రిన్సిపల్ - పీజీ డిగ్రీ + బీ.ఎడ్.
- పీజీటీ - సంబంధిత సబ్జెక్టులో పీజీ + బీ.ఎడ్.
- టీజీటీ - సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ + బీ.ఎడ్.
- ఫీమేల్ స్టాఫ్ నర్స్ - బి.ఎస్సీ నర్సింగ్.
- హాస్టల్ వార్డెన్ - ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్.
- అకౌంటెంట్ - కామర్స్‌లో గ్రాడ్యుయేషన్.
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ - 12వ తరగతి ఉత్తీర్ణత.
- ల్యాబ్ అటెండెంట్ - 10వ తరగతి లేదా 12వ తరగతి (సైన్స్ సబ్జెక్టులు) + ల్యాబ్ టెక్నిక్ డిప్లొమా.
వయోపరిమితి..
- ప్రిన్సిపల్ - గరిష్టంగా 50 ఏళ్లు
- పీజీటీ - 40 ఏళ్లు
- టీజీటీ - 35 ఏళ్లు
- హాస్టల్ వార్డెన్ / స్టాఫ్ నర్స్ - 35 ఏళ్లు
- అకౌంటెంట్ / ల్యాబ్ అటెండెంట్ / జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ - 30 ఏళ్లు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం..
- ప్రిన్సిపల్ - రూ.78,800 - రూ.2,09,200
- పీజీటీ - రూ.47,600 - రూ.1,51,100
- టీజీటీ - రూ.44,900 - రూ.1,42,400
- అకౌంటెంట్ - రూ.35,400 - రూ.1,12,400
- స్టాఫ్ నర్స్ / హాస్టల్ వార్డెన్ - రూ.29,200 - రూ.92,300
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ - రూ.19,900 - రూ.63,200
- ల్యాబ్ అటెండెంట్ - రూ.18,000 - రూ.56,900
దరఖాస్తు రుసుము..
- ప్రిన్సిపల్ పోస్టులకు - జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2,500
- పీజీటీ & టీజీటీ పోస్టులకు - జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2,000
- నాన్-టీచింగ్ పోస్టులకు - జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,500
- మహిళలు / ఎస్సీ / ఎస్టీ / పీహెచ్ అభ్యర్థులకు - అన్ని పోస్టులకు రూ.500 మాత్రమే
దరఖాస్తు గడువు..
అక్టోబర్ 23, 2025 వరకు
ఎంపిక విధానం..
అభ్యర్థులను రాత పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం..
అర్హత కలిగిన వారు nests.tribal.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు సమర్పించే ముందు అవసరమైన సర్టిఫికేట్లు, ఫోటో, సంతకం స్కాన్ కాపీలు సిద్ధంగా ఉంచుకోవాలి.












Click it and Unblock the Notifications