28వేల ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్: హరీశ్ రావు, 3 రోజుల్లో గ్రూప్-4కి

హైదరాబాద్: తెలంగాణలో త్వరలోనే భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవుతుందని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. రానున్న రెండు మూడు రోజుల్లో గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌ వస్తుందని తెలిపారు. రాబోయే వారం రోజుల్లో 28 వేల ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి హరీశ్‌ రావు చెప్పారు.

Recommended Video

    IT Companies మూన్‌లైటింగ్‌పై ఐటీ కంపెనీలు సీరియస్ *Trending | Telugu OneIndia

    ఇప్పటికే 2910 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

    రాష్ట్రంలో 2910 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావడంతో.. నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    గ్రూప్‌-2 ఉద్యోగాలు 663, గ్రూప్‌-3 ఉద్యోగాలు 1373 భర్తీకి అనుమతించింది. అలాగే, పశుసంవర్థక శాఖలో 294, గిడ్డంగుల సంస్థలో 50, విత్తన ధ్రువీకరణ సంస్థలో 25 పోస్టులతో పాటు పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

    తాజా అనుమతితో ఉద్యోగాల నియామక ప్రక్రియలో 50వేల మైలురాయిని అధిగమించినట్లు ఆర్థికశాఖా మంత్రి హరీష్ రావు తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు గడచిన మూడు నెలలుగా ఇప్పటి వరకు 52,460 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. మిగతా ఉద్యోగాల భర్తీకి కూడా త్వరలోనే అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు.

    notification will release soon for fill 28k jobs, says minister Harish Rao

    గ్రూప్​-2 ఉద్యోగాల్లో జీఏడీ ఏఎస్ఓ పోస్టులు 165, పంచాయతీరాజ్ ఎంపీఓ పోస్టులు 125, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు 98, ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులు 97, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు 59 ఉన్నాయి. 38 చేనేత ఏడీఓ పోస్టులు, 25 ఆర్థికశాఖ ఏఎస్ఓ పోస్టులు, 15 అసెంబ్లీ ఏఎస్ఓ పోస్టులు, 14 గ్రేడ్ టూ సబ్ రిజిస్ట్రార్ పోస్టులు, 11 గ్రేడ్ త్రీ మున్సిపల్ కమిషనర్ పోస్టులు, 9 ఏఎల్ఓ, 6 న్యాయశాఖ ఏఎస్ఓ పోస్టులు ఉన్నాయి.

    గ్రూప్-3 ఉద్యోగాల్లో మొత్తం 99 విభాగాధిపతులు, కేటగిరీల పరిధిలో 1373 జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులున్నాయి. వ్యవసాయశాఖలో 199 గ్రేడ్-2 ఏఈఓ పోస్టులు, 148 ఏఓ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉద్యానవన శాఖలో 21 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది.

    సహకార శాఖలో 63 అసిస్టెంట్ రిజిస్ట్రార్, 36 జూనియర్ ఇన్ స్పెక్టర్ పోస్టులున్నాయి.పశుసంవర్ధకశాఖలో 183 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, 99 వెటర్నరీ అసిస్టెంట్ సహా 294 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చారు. విత్తన ధృవీకరణ సంస్థలో 19 సీడ్ సర్టిఫికేషన్ అధికారి, ఆరు ఆర్గానిక్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చారు. మత్య్సశాఖలో తొమ్మిది ఎఫ్​డీఓ, నాలుగు ఏడీ, రెండు అసిస్టెంట్ ఇన్​స్పెక్టర్ పోస్టులు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకుల పరిధిలో 12 పోస్టులు, ఇంధనశాఖలో 11 సహాయ ఎలక్ట్రికల్ పోస్టులు, గిడ్డంగుల సంస్థలో 28 ఏడబ్ల్యూఎం, 14 మేనేజర్ సహా 50 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+