తెలంగాణలో 4661 స్టాఫ్ నర్సుల ఉద్యోగాలకు నెలాఖరులోగా నోటిఫికేషన్

హైదరాబాద్: తెలంగాణలో భారీ ఎత్తున నర్సు పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ త్వరలో 4,661 స్టాఫ్ నర్సు పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. డిసెంబర్ నెలాఖరులోగా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ రానుంది.

నర్సుల పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. నోటిఫికేషన్ తర్వాత పరీక్షకు అభ్యర్థులు సిద్ధమయ్యేందుకు రెండు నెలల గడువు ఇస్తారని తెలిసింది. బహుళ ఐచ్ఛిక సమాధానాల రూపంలో ప్రశ్నపత్రం రూపకల్పనకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమించనున్నారు. పరీక్ష నిర్వహణ, మూల్యాంకన బాధ్యతలను స్వతంత్ర సంస్థకు అప్పగించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. వీరు ఫలితాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థకు అందజేస్తారు.

 Notification will release soon for to fill 4661 staff nurse posts in Telangana.

ఆ ఫలితాలకు వెయిటేజీ మార్కులను కలిపి, తుది అర్హుల జాబితాను ఆ సంస్థ ప్రకటిస్తుంది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనం, ఫలితాల వెల్లడికి ఎలాంటి నిబంధనలు అనుసరిస్తుందో.. అదే విధానాన్ని స్టాఫ్‌నర్సుల నియామకాల్లోనూ అనుసరించాలని వైద్యశాఖ.. రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థను ఆదేశించింది.

కాగా, ఇప్పటికే ఒప్పంద, ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన స్టాఫ్‌నర్సులుగా పనిచేస్తున్నవారికి, గతంలో పనిచేసినా వారికి వెయిటేజీ మార్కులుంటాయి. స్టాఫ్‌నర్సు అర్హత పరీక్షలో పొందిన మార్కుల శాతం ఆధారంగా గరిష్ఠంగా 80 పాయింట్లు ఇస్తారు. మిగిలిన 20 పాయింట్లను పని అనుభవానికి వెయిటేజీగా కేటాయిస్తారు. ఈ విధంగా మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. వెయిటేజీ ప్రాంతాన్ని బట్టి కేటాయించడం జరుగుతుంది.

గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన, చేస్తున్నవారికి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, ఇతర ప్రాంతాల్లో అందించిన సేవలకు 6 నెలలకు 2 పాయింట్ల చొప్పున వెయిటేజీ ఇస్తారు. ఇక్కడ 6 నెలలు పూర్తయితేనే వెయిటేజీకి అర్హులన్నమాట. ఆయా వైద్య సంస్థల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్నవారు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్‌ పొందాల్సి ఉంటుంది. అలాగే నర్స్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులందరూ తెలంగాణ స్టేట్ నర్సింగ్‌ కౌన్సిల్‌లో తమ అర్హత ధ్రువపత్రాలను నమోదు చేసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+