ఇంటర్ అర్హతతో నెలకు రూ.55,932 జీతం ఇచ్చే ఉద్యోగాలు...
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త అందించింది. మొత్తం 114 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైపెండరీ ట్రైనీ, అసిస్టెంట్ గ్రేడ్-1 వంటి కీలక పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా పలు సాంకేతిక, నాన్-టెక్నికల్ విభాగాల్లో నియామకాలు చేపడుతున్నారు. అందులో.. సైంటిఫిక్ అసిస్టెంట్/బీ (సివిల్) - 2, స్టైపెండరీ ట్రైనీ / టెక్నీషియన్ - 95, ఎక్స్-రే టెక్నీషియన్ - 2, అసిస్టెంట్ గ్రేడ్-1 - 15 ఉన్నాయి.

విభాగాలు..
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, హెల్త్ ఫిజిక్స్, ప్లాంట్ ఆపరేటర్, మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ తదితరాలు.
విద్యార్హత..
అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంటర్‌మీడియట్ / ఐటీఐ / డిప్లొమా / డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని పోస్టులకు పని అనుభవం కూడా తప్పనిసరిగా ఉండాలి. పూర్తి అర్హతల వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో పొందుపరిచారు.
వయోపరిమితి (Age Limit)..
2026 ఫిబ్రవరి 4 నాటికి అభ్యర్థుల వయస్సు:
కనీసం: 18 ఏళ్లు
గరిష్టం: 30 ఏళ్లు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం..
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 2026 జనవరి 15
దరఖాస్తుల చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 4
అభ్యర్థులు NPCIL అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ఫీజు..
జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్: ₹150
ఎస్సీ / ఎస్టీ: ఫీజు మినహాయింపు
ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
ఎంపిక విధానం..
అభ్యర్థుల ఎంపిక కింది దశల ద్వారా జరుగుతుంది:
రాత పరీక్ష (Written Test)
ఇంటర్వ్యూ / స్కిల్ టెస్ట్ (పోస్ట్‌ను బట్టి)
తుది మెరిట్ లిస్ట్ ఆధారంగా నియామకాలు జరుగుతాయి.
జీతభత్యాలు..
సైంటిఫిక్ అసిస్టెంట్: ₹55,932
స్టైపెండరీ ట్రైనీ / టెక్నీషియన్: ₹34,286
ఎక్స్-రే టెక్నీషియన్ / అసిస్టెంట్ గ్రేడ్-1: ₹40,290
ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు కూడా ఉంటాయి.
అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలి. అర్హతలు, పరీక్షా విధానం, సిలబస్ వంటి వివరాలను ధృవీకరించుకోవాలి.












Click it and Unblock the Notifications