Oracle Layoffs: అసలు టార్గెట్ వారేనా ? తాజా మాజీ ఉద్యోగి షాకింగ్..!
ఐటీ దిగ్గజ సంస్థ ఒరాకిల్ (oracle) తాజాగా ప్రపంచవ్యాప్తంగా 30 వేల మంది ఉద్యోగులను లేఆఫ్స్ (layoffs)ఇచ్చి పంపేసింది. ఇందులో భారత్ నుంచే 12 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వాస్తవానికి పలు ఐటీ దిగ్గజ సంస్థలు ఈ మధ్య చేపట్టిన లేఆఫ్స్ తో పోలిస్తే ఇది పెద్ద విషయం కాదు. కానీ ఈ లేఆఫ్స్ వెనుక బయటపడుతున్న కారణాలను చూస్తే మాత్రం వీటిపై ఇండస్ట్రీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ చర్చలకు బలం చేకూర్చేలా తాజాగా మాజీలైన ఉద్యోగులు కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఒరాకిల్ లో చాలా కాలంగా పనిచేస్తున్న ఒక ఉద్యోగి పెట్టిన ఓ లింక్డ్‌ఇన్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ ఉద్యోగ కోతలు పైకి కనిపించినంత యాదృచ్ఛికంగా జరిగి ఉండకపోవచ్చని ఆ పోస్ట్ సూచిస్తోంది. ఒరాకిల్‌లో మూడు దశాబ్దాలకు పైగా పనిచేసి, ఇటీవల సెక్యూరిటీ అలర్ట్ మేనేజర్‌గా పనిచేసిన నీనా లూయిస్ .. తన అనుభవాన్ని ఆ పోస్ట్‌లో పంచుకున్నారు. ఒరాకిల్‌లో 34 సంవత్సరాల తర్వాత, ఈ రోజు ఉద్యోగాలు కోల్పోయిన సుమారు 30వేల మందిలో తాను కూడా చేరానని ఆమె వెల్లడించారు. ఇది చాలా షాక్‌కు గురిచేసిందని తెలిపారు. తను అత్యుత్తమ సహోద్యోగులలో చాలా మందిని కూడా తొలగించారని తెలిపారు.

ఆమె పోస్ట్‌లో, ఈ ఉద్యోగ కోతలను ఎలా నిర్ణయించి ఉండవచ్చనే దానిపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంమవుతున్నాయి. ఉద్యోగాల తొలగింపులు ఉన్నత స్థాయి ఉద్యోగులు, మధ్య స్థాయి మేనేజర్ల క్రమాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోందని ఆమె తెలిపారు. ముఖ్యంగా అద్భుతమైన స్టాక్ ఆప్షన్లు ఉన్నవారిని తొలగిస్తున్నారని లూయిస్ పేర్కొన్నారు. అధిక వేతనం లేదా ఈక్విటీ ఉన్న ఉద్యోగులకు లేఆఫ్స్ లో ప్రాధాన్యత ఇచ్చి ఉండవచ్చని తెలిపారు. ఈ వారం తమ ఉద్యోగాలను కోల్పోయిన చాలా మంది కూడా ఆమె పోస్ట్‌ను ఫాలో అయ్యారు. ఈ లేఆఫ్స్ హెల్త్, సేల్స్, క్లౌడ్, కస్టమర్ సక్సెస్, నెట్‌సూట్‌తో సహా ఒరాకిల్‌లోని పలు టీమ్స్ పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications