PGCILలో ఉద్యోగాలు: ఫీల్డ్ ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టులకు అప్లయ్ చేయండి

ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేయాలని ఎదురు చూస్తున్న వారికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గుడ్ న్యూస్ తెలిపింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఫీల్డ్ ఇంజినీర్ మరియు ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 137 పోస్టులను భర్తీ చేయనుంది.

ఇక పోస్టులను విభాగాల వారీగా చూస్తే ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)- 48 పోస్టులు, ఫీల్డ్ ఇంజినీర్ (సివిల్)- 17 పోస్టులు, ఫీల్డ్ సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్)- 50 పోస్టులు, ఫీల్డ్ సూపర్ వైజర్ (సివిల్)-22 పోస్టులు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించింది. విద్యార్హతల విషయానికొస్తే ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్ మరియు సివిల్ )పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/సివిల్ ఇంజినీరింగ్‌లో 55శాతం మార్కులో డిగ్రీ. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మాత్రం పాసైతే చాలు. ఇక ఫీల్డ్ సూపర్ వైజర్ పోస్టులకు (ఎలక్ట్రికల్/ సివిల్) గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ లేదా సివిల్ ఇంజినీరింగ్‌లో 55శాతం మార్కులతో డిప్లొమా. ఇక ఫీల్డ్ ఇంజినీర్‌ మరియు ఫీల్డ్ సూపర్‌వైజర్‌లకు ఒక ఏడాది పాటు పని అనుభవం తప్పనిసరి.

PGCIL Recruitment 2021: Apply for field engineers and supervisor jobs

అర్హులైన అభ్యర్థుల వయస్సు 27 ఆగష్టు 2021 నాటికల్లా 29 ఏళ్లు ఉండాలి. ప్రభుత్వ రిజర్వేషన్లు వర్తిస్తాయి. అప్లికేషన్ ఫీజును కూడా నోటిఫికేషన్‌లో పొందుపర్చారు. ఫీల్డ్ ఇంజినీర్ ఎలక్ట్రికల్ మరియు సివిల్ పోస్టులకు అప్లయ్ చేసే అభ్యర్థులు రూ. 400/- చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఫీల్డ్ సూపర్‌వైజర్ ఎలక్ట్రికల్ మరియు సివిల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.300/- చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది.

ఇక పవర్‌గ్రిడ్ ఆఫ్ ఇండియా భర్తీ చేసే ఈ 137 పోస్టులన్నీ ఒప్పంద ప్రాతిపదకనే ఉంటాయి. ఫీల్డ్ ఇంజినీర్‌గా ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30వేల నుంచి రూ.1,20,000 వరకు వేతనం చెల్లిస్తారు. అదే ఫీల్డ్ సూపర్‌వైజర్‌గా ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.23000 నుంచి రూ.1,05000 వరకు వేతనంగా చెల్లిస్తారు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 27 ఆగష్టు 2021. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.powergrid.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+