Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైల్వేలో 11 వేల NTPC పోస్టులు.. ఎగ్జామ్ డేట్స్ పై క్లారిటీ..!

రైల్వే ఉద్యోగం కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆర్ఆర్ బీ ఎన్టీపీసీ యూజీ, గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టలకు సంబంధించి పరీక్ష తేదీలను ఆర్ఆర్ బీ సంస్థ త్వరలో ప్రకటించనుంది. అప్లికేషన్ పూర్తయి 8 నెలలు గడిచింది. అయితే సార్వత్రిక ఎన్నికలతోపాటు వివిధ కారణాల వల్ల పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. అయితే తాజాగా ఈ పరీక్షల నిర్వహణ ప్రక్రియను అధికారులు వేగవంతం చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ఎగ్జామ్స్ తేదీలు, అడ్మిట్ కార్డులను అధికారికంగా విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. మార్చి- ఏప్రిల్ నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులు ఆర్ఆర్ బీ అధికారిక వెబ్ సైట్లో పూర్తి వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆర్ఆర్ బీ ఎన్టీపీసీ రిక్రూట్ మెంట్ ద్వారా దాదాపు 11, 558 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో 8, 113 గ్రాడ్యుయేట్, 3,445 అండర్ గ్రాడ్యుయేట్ లెవల్ పోస్టులు ఉన్నాయి. ఆర్ఆర్ బీ ఎన్టీపీసీ పోస్టులకు ఇంటర్, డిగ్రీ అభ్యర్థులకు సిలబస్, పరీక్ష విధానం ఒకేలా ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అన్ని పోస్టులకు పోటీ పడవచ్చు. అయితే డిగ్రీ అర్హత కలిగిన వారికి నిర్వహించే పరీక్షతో పోలిస్తే.. ఇంటర్ అభ్యర్థులకు నిర్వహించే ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు కఠినతరం తక్కువ ఉంటుంది.

Railway Department to Announce RRB NTPC Exam Dates and Hall Ticket Release Soon
గ్రాడ్యుయెట్ అర్హత గలిగిన అభ్యర్థులు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఇక అండర్ గ్రాడ్యుయెట్ అభ్యర్థులు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రైయిన్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు ఉంటాయి.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+