పదో తరగతి అర్హతతో రైల్వే ఉద్యోగాలు.. నార్త్ ఈస్ట్రన్ రైల్వేలో 1104 పోస్టులు..
నిరుద్యోగులకు నార్త్ ఈస్ట్రన్ రైల్వే ఓ శుభవార్తను అందించింది. మొత్తం 1104 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే అర్హతగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. గోరఖ్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్- నార్త్ ఈస్ట్రన్ రైల్వే.. ఎన్‌ఈఆర్ పరిధిలోని పలు యూనిట్లలో అప్రెంటిస్‌షిప్ శిక్షణకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1104 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అప్లయ్ చేయాలనుకునేవారు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణణ సాధిస్తే సరిపోతుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ను https://apprentice.rrcner.net/ సంప్రదించగలరు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్ టేడ్రుల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఇతర పూర్తి వివరాలు..
ఈ పోస్టులకు మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.12.06.2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకునేందుకు జులై 11, 2024 చివరితేదిగా నిర్ణయించడమైనది. ఇందులో ఎంపికయినవారికి ఒక సంవత్సరం పాటు శిక్షణ వ్యవధి ఉంటుంది.

ఖాళీగా ఉన్న యూనిట్లివే...
మెకానికల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్), సిగ్నల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్), బ్రిడ్జ్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్), మెకానికల్ వర్క్‌షాప్ (ఇజ్జత్‌నగర్), డీజిల్ షెడ్ (ఇజ్జత్‌నగర్), క్యారేజ్ అండ్ వ్యాగన్ (ఇజ్జత్‌నగర్), క్యారేజ్ అండ్ వ్యాగన్ (లఖ్‌నవూ జంక్షన్), డీజిల్ షెడ్ (గోండా), క్యారేజ్ అండ్ వ్యాగన్ (వారణాసి) యూనిట్లలో ఈ ఖాళీలున్నాయి.












Click it and Unblock the Notifications