RGUKT : ఏపీ ఆర్జీయూకేటీలో టీచింగ్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల..
RGUKT Recruitment 2024 : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ఎపీలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 194 టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 194 లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవాలనుకునేవారు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 9 నుంచి ప్రారంభమవుతుంది. జనవరి 22 దరఖాస్తులకు చివరితేదీగా పరిగణించడమైనది.
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల మొత్తం వివరాలు : 194

మొత్తం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు : 133
విభాగం, సబ్జెక్టు: బయాలజీ, సివిల్ ఇంజినీరింగ్, సీఎస్‌ఈ, ఈఈఈ, ఈసీఈ, ఇంగ్లిష్, మేనేజ్‌మెంట్, మ్యాథమెటిక్స్, మెకానికల్, ఎంఎంఈ తదితర విభాగాల్లో పోస్టులు ఖాళీలున్నాయి.
విద్యార్హతలు : సంబంధిత విభాగంలో ఎంఈ/ ఎంటెక్, నెట్/ సెట్ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఎక్స్ పీరియన్స్ కూడా ఉండాలి.
అప్లయ్ చేసుకునే విధానం : ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పరీక్షకు ఎంపిక చేయు విధానం : ఇంటర్వ్యూ, రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తులకు చివరి తేదీ : జనవరి 22, 2024
లెక్చరర్ పోస్టులు : 61
సబ్జెక్టుల వారీగా విభాగాలు : బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, తెలుగు తదితర విభాగాల్లో పోస్టులు ఖాళీలున్నాయి. విద్యార్హత : కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టు/ భాషలో ఎంఏ/ ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
జిల్లా వారీగా పోస్టుల వివరాలు :
ప్రకాశం జిల్లా, ఒంగోలు క్యాంపస్ : 27 పోస్టులు ఖాళీలున్నాయి.
కడప జిల్లా ఆర్కే వ్యాలీ క్యాంపస్‌లో : 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల క్యాంపస్‌లో : 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఏలూరు జిల్లా, నూజివీడు క్యాంపస్ : 02 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
సబ్జెక్టుల వారీగా ఖాళీగా ఉన్న పోస్టులు వివరాలు :
ఈసీఈ: 38 పోస్టులు
సీఎస్‌ఈ: 34 పోస్టులు
ఈఈఈ: 23 పోస్టులు
సివిల్ ఇంజినీరింగ్: 11 పోస్టులు
మేనేజ్‌మెంట్: 08 పోస్టులు
ఇంగ్లిష్: 06 పోస్టులు
మ్యాథమెటిక్స్: 05 పోస్టులు
మెకానికల్: 05 పోస్టులు
బయాలజీ: 02 పోస్టులు
ఎంఎంఈ: 01 పోస్టు
పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌ను : https://www.rgukt.in/Institute.php?view=Career సంప్రదించగలరు.












Click it and Unblock the Notifications