RRB NTPC JOBS: భారీ జీతంతో 8850 ఉద్యోగాలకు నోటిఫికేషన్..!
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నిరుద్యోగులకు తీపి కబురు ప్రకటించింది. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలో (NTPC) 8,850 ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ప్రక్రియ ద్వారా భారతీయ రైల్వేలో పలు గ్రాడ్యుయేట్, అండర్-గ్రాడ్యుయేట్ స్థాయి ఉద్యోగాలకు నియామకం జరగనుంది. ఇంటర్, డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
కాగా ఈ నోటిఫికేషన్‌లో మొత్తం స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, ట్రాఫిక్ అసిస్టెంట్ (మెట్రో రైల్వే), చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్, సీనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్, జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్-కమ్-టైపిస్ట్, ట్రైన్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వంటి పలు పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 21 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా.. నవంబర్ 20తో గడువు ముగియనుంది.

మొత్తం పోస్టులు..
8850
ఖాళీల వివరాలు..
డిగ్రీ క్వాలిఫికేషన్.. (మొత్తం పోస్టులు 5817)
- స్టేషన్ మాస్టర్ : 615 పోస్టులు
- గూడ్స్ ట్రైన్ మేనేజర్: 3423 పోస్టులు
- ట్రాఫిక్ అసిస్టెంట్ (మెట్రో రైల్వే): 59 పోస్టులు
- చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్: 161 పోస్టులు
- జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 921 పోస్టులు
- సీనియ్ క్లర్క్ టైపిస్ట్: 638 పోస్టులు
ఇంటర్ క్వాలిఫికేషన్.. (మొత్తం పోస్టులు 3058)
- జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 163 పోస్టులు
- అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 394 పోస్టులు
- ట్రైన్ క్లర్క్: 77 పోస్టులు
- కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2424 పోస్టులు
వయస్సు..
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ క్వాలిఫికేషన్ పోస్టులకు 18 నుంచి 36 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఇంటర క్వాలిఫికేషన్ పోస్టులకు 18 నుంచి 33 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం..
నెలకు ప్రారంభ వేతనం రూ.19,900 నుంచి రూ.35,400 వరకు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు..
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళా, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250
ఎంపిక ప్రక్రియ..
- CBT-1
- CBT-2
- స్కిల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్ వంటి దశలు ఉంటాయి.
దరఖాస్తు ప్రక్రియ..
- మొదటి భాగం - నమోదు కోసం
- రెండవ భాగం - అదనపు వివరాలను నింపడం, పత్రాలను అప్‌లోడ్ చేయడం మరియు దరఖాస్తు రుసుము చెల్లించడం కోసం.
పరీక్ష విధానం..
- CBT-1లో జనరల్ అవేర్‌నెస్, గణితం, మరియు రీజనింగ్ పై MCQలు ఉంటాయి. ( 100 ప్రశ్నలు, 100 మార్కులకు ఉంటాయి)
- CBT-2 స్కోర్ మెరిట్ కోసం పరిగణించబడతాయి. టైపింగ్ స్కిల్ టెస్ట్ (TST)లో అభ్యర్థులు నిమిషానికి 30 wpm ఇంగ్లీష్ లేదా 25 wpm హిందీ టైప్ చేయాలి. ( 120 ప్రశ్నలు, 120 మార్కులకు ఉంటాయి)
- ప్రతి పరీక్షకు 90 నిమిషాలు (PwD వారికి 120 నిమిషాలు) వ్యవధి ఉంటుంది. తప్పు సమాధానాలకు 1/3 మార్కులు తీసివేయబడతాయి.
కాగా ఎగ్జామ్ డేట్స్ త్వరలో ప్రకటించనున్నారు. నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ https://www.rrbcdg.gov.in/ ను సందర్శించవచ్చు. అభ్యర్థులు తమ పత్రాలు, ఫోన్ నంబర్‌లు, ఇమెయిల్ చిరునామాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications