BANK JOBS: లక్షకు పైగా జీతంతో SBIలో ఉద్యోగాలు..!!

బ్యాంకింగ్ రంగంలో జాబ్ చేయాలనే ఆసక్తి ఉన్న అభ్యర్ధులకు గోల్డెన్ ఛాన్స్. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు బంపర్ అవకాశాన్ని అందించింది. రెగ్యులర్‌ విదానంలో ఖాళీగా ఉన్న 122 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది.

డిగ్రీ లేదా ఎంబీఏ/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ ఎంఎంఎస్‌/ సీఏ/ సీఎఫ్‌ఏ/ ఐసీడబ్ల్యూఏ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 11వ తేదీ నుంచి అక్టోబర్‌ 2 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువుగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

sbi-notification-for-122-jobs-with-huge-salary

మొత్తం ఖాళీలు..

122

వెకెన్సీలు..

  • మేనేజర్‌(క్రెడిట్‌ అనలిస్ట్‌): 63
  • మేనేజర్‌(ప్రొడక్ట్స్‌-డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌): 34
  • డిప్యూటీ మేనేజర్‌ (ప్రొడక్ట్స్‌-డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌): 25

విద్యార్హత..

ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా ఎంబీఏ/పీజీడీబీఏ/పీజీడీబీఎం/ఎంఎంఎస్‌/సీఏ/సీఎఫ్‌ఏ/ఐసీడబ్ల్యూఏ, బీఈ/బీటెక్‌ పాసై ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

దరఖాస్తు గడువు..

2025 సెప్టెంబర్ 11 నుంచి 2025 అక్టోబర్ 2 వరకు

వయస్సు..

ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. మేనేజర్‌కు 28 - 35 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌కు 25 - 32 ఏళ్లు, మేనేజర్‌(క్రెడిట్‌ అనలిస్ట్‌)కు 25 - 35 ఏళ్ల వయస్సు ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ..

ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి..

దరఖాస్తు ఫీజు..

  • జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.750 ఫీజు ఉంటుంది.
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం..

ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

జీతం..

  • సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది.
  • నెలకు మేనేజర్‌కు రూ.85,920 - రూ.1,05,280
  • డిప్యూటీ మేనేజర్‌కు రూ.64,820 - రూ.93,960 జీతం ఉంటుంది.
  • అదనంగా DA, HRA, స్పెషల్ అలవెన్సులు లభిస్తాయి.

అప్లికేషన్ ప్రాసెస్..

  • SBI అధికారిక వెబ్‌సైట్ https://sbi.co.in లోకి వెళ్లాలి.
  • Careers సెక్షన్‌లోకి వెళ్లి Specialist Cadre Officer Recruitment లింక్ క్లిక్ చేయాలి.
  • ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌లో వివరాలు నమోదు చేసి, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
  • ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించి, ఫైనల్ సబ్మిట్ చేయాలి.
  • ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+