SBI Trade Finance Officer: అప్లై చేసుకోండిలా..!
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ. అలాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం సాధించాలని చాలా మంది నిరుద్యోగులకు ఉంటుంది. అలాంటి వారి కోసం గుడ్ న్యూస్. ఎస్బీఐలో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ అర్హతతో వీటికి పోటీ పడవచ్చు. 150 పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 3లోపు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీకోసం..
మొత్తం పోస్టుల సంఖ్య : 150
విద్యార్హతలు : ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ విద్యార్థులకు ఫీజు రూ.750 కాగా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు.
అప్లికేషన్ ప్రారంభ తేదీ: జనవరి 3 న ప్రారంభం, అయితే అప్లికేషన్ ముగింపు తేదీ జనవరి 23 ఉండగా... తాజాగా ఆ గడువును ఫిబ్రవరి 3 వరకు పెంచుతూ SBI నిర్ణయం తీసుకుంది.అప్లికేషన్ విధానం పూర్తిగా ఆన్ లైన్ లో ఉంటుంది. ముందుగా SBI అధికారిక సైట్ కు వెళ్లి.. జాబ్ ఓపెనింగ్స్ బార్ ను క్లిక్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
వయోపరిమితి : అప్లై చేసుకునే అభ్యర్థుల కనిష్ఠ వయసు 23 సంవత్సరాలు కాగా గరిష్ఠ వయసు 32 సంవత్సరాలు. ఆయా కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు కూడా ఉంది. పరీక్ష విధానం పూర్తిగా ఆన్ లైన్ విధానంలో ఉంటుంది.












Click it and Unblock the Notifications