Singareni: సింగరేణిలో 327 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు..

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌..సింగరేణిలో 327 ఉద్యోగాల‌కు ఈ నెల 14వ తేదీన నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఎగ్జిక్యూటివ్‌, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడ‌ర్‌గ‌ల పోస్టుల‌కు నోటికేష‌న్ జారీ అయ్యింది. సింగ‌రేణిలో వ‌రుస‌గా ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు వెలువ‌డుతున్నాయి. ఫిబ్ర‌వ‌రిలో 272 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌డు తాజాగా మ‌రో నోటిఫికేష‌న్‌తో ముందుకు వ‌చ్చింది.

ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో మొత్తం 327 పోస్టుల భర్తీకి గాను సింగ‌రేణీ యాజ‌మాన్యం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇది కేవ‌లం పేప‌ర్ ప్ర‌క‌ట‌న మాత్ర‌మే. త్వ‌ర‌లోనే పూర్తిస్థాయి నోటిఫికేష‌న్‌ను సింగ‌రేణి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామ‌ని అధికారులు పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో 49 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు ఉండ‌గా, నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో 100 జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ క‌ల‌వు. మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగంలో 33 పోస్టులు, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ-1లో మొత్తం 47 పోస్టులు ఉన్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌లో వెలువ‌డింది. 98 పోస్టులు ఎలక్ట్రిషియన్ ట్రైనీ కేటగిరీలో ఉన్నాయి. అర్హ‌త, అస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ వ‌చ్చ నెల 15న మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. మే 4న ఆన్‌లైన్ అప్ల‌యికు చివ‌రితేదిగా నిర్ణ‌యించ‌డ‌మైన‌ది.

Singareni 327 Executive and Non-Executive Jobs in Singareni

విద్యార్హ‌త‌లు : ఆయా కేట‌గిరీల్లో పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించడ‌మైన‌ది.

వయసు : ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల‌కు అప్లయ్ చేయాల‌నుకున్న అభ్యర్థుల వయసు గరిష్ఠంగా 30 సంవత్సరాలకు మించకుండా చూసుకోవాలి. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 45 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అయిదేళ్లపాటు వయో ప‌రిమితి వర్తిస్తుంది.

అప్ల‌య్ చేయుట‌కు ఫీజు చెల్లింపు వివ‌రాలు: ఇత‌రులు 1000 రూపాయ‌లు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, సింగరేణి సంస్థ ఉద్యోగులు మాత్రం 100రూపాయ‌లు చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌‌లైన్ ద్వారా మాత్ర‌మే ద‌రఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు రాత‌ప‌రీక్ష‌, స‌ర్టిఫికేట్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. 15.04.2024 మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమ‌వ‌తుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 04.05.2024 నిర్ణ‌యించ‌డ‌మైన‌ది. ఇత‌ర స‌మాచారం కోసం అభ్య‌ర్థులు https://scclmines.com/012024/ ఈ వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+