సదరన్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2024...దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..
నిరుద్యోగులకు రైల్వేశాఖ ఓ శుభవార్తను మోసుకొచ్చింది. దక్షిణ రైల్వేలో ఖాళీగా ఉన్న 2,860 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. సదరన్ ఇండియన్ రైల్వే వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,860 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేది ఫిబ్రవరి 28. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
విద్యార్హత : 50 శాతం మార్కులతో పదో తరగతి, ఇంటర్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు ఈ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ జాబితా, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

శిక్షణా సమయం : ఫిట్టర్, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్), మెడికల్ ల్యాబొరేటరీ టెక్నిషియన్స్ ట్రేడులకు 15 నెలల నుంచి 2 సంవత్సరాలు, ఇతర ట్రేడులకు 1 సంవత్సరం ఉంటుంది.
అప్లయ్ చేసుకునేందుకు రుసుము : రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పే స్కేల్: నెలకు రూ.9,000. నుంచి రూ.12,000గా ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 29, 2024 నుంచి ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ ఫిబ్రవరి 28, 2024. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఈ https://sr.indianrailways.gov.in/ వెబ్‌సైట్ ను సందర్శించగలరు.
మొత్తం అప్రెంటీస్ పోస్టుల వివరాలు - 2,860
సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వర్క్‌షాప్(పొదనూర్, కోయంబత్తూర్): 20
క్యారేజ్ అండ్ వేగన్ వర్క్స్(పెరంబూర్): 83
రైల్వే హాస్పిటల్(పెరంబూర్): 20
సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వర్క్‌షాప్(పొదనూర్, కోయంబత్తూర్): 95
తిరువనంతపురం డివిజన్: 280
పాలక్కడ్ డివిజన్: 135
సాలెమ్ డివిజన్: 294
క్యారేజ్ అండ్ వేగన్ వర్క్స్(పెరంబూర్): 333
లోకో వర్క్స్(పెరంబుర్): 135
ఎలక్ట్రికల్ వర్క్‌షాప్(పెరంబూర్): 224
ఇంజినీరింగ్ వర్క్‌షాప్(అరక్కోణం): 48
చెన్నై డివిజన్(పర్సనల్ బ్రాంచ్): 24
చెన్నై డివిజన్(ఎలక్ట్రికల్/రోలింగ్ స్టాక్/అరక్కోణం): 65
చెన్నై డివిజన్(ఎలక్ట్రికల్/రోలింగ్ స్టాక్/అవది): 65
చెన్నై డివిజన్(ఎలక్ట్రికల్/రోలింగ్ స్టాక్/తంబరం): 55
చెన్నై డివిజన్(ఎలక్ట్రికల్/రోలింగ్ స్టాక్/రాయపురం): 30
చెన్నై డివిజన్- మెకానికల్(డిజిల్): 22
చెన్నై డివిజన్- మెకానికల్(క్యారేజ్ అండ్ వేగన్): 250
చెన్నై డివిజన్- రైల్వే హాస్పిటల్(పెరంబూర్): 03
సెంట్రల్ వర్క్‌షాప్(పొన్మలై): 390
తిరుచిరాపల్లి డివిజన్: 187
మధురై డివిజన్: 102












Click it and Unblock the Notifications