SSC CGLE 2024 : ఎస్ఎస్‌సి సీజీఎల్ టైర్ 1 ప్రాథమిక కీ విడుదల..
ఎస్ఎస్‌సి అభ్యర్థులకు అలర్ట్.. స్టాఫ్ సెలక్షన్ కమీషన్ సీజీఎల్ టైర్ 1 ప్రాథమిక కీ విడుదల చేసింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఎస్ఎస్‌సి అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రాథమిక కీ రిజిస్టర్డ్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి సమాధానాల కీతో పాటు రెస్పాన్స్ షీట్‌ను కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రాథమిక కీపై ఏమైనా అభ్యంతరాలుంటే రూ.100 రుసుంతో ఉంటే అక్టోబర్ 3 నుంచి 6వ తేదీలోగా తెలియజేయాల్సి ఉంటుంది.
ఎస్ఎస్‌సి సీజీఎల్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని 17,727 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇక, సీజీఎల్ 2024 పరీక్షలు సెప్టెంబర్ 9 నుంచి 26వ తేది వరకు జరిగాయి. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన సమాధానాల ప్రాథమిక కీని స్టాఫ్ సెలక్షన్ కమీషన్ విడుదల చేసింది. సీజీఎల్ పరీక్షలు సిబిటి విధానంలో జరిగాయి. సీజీఎల్ ఉద్యోగాల కోసం టైర్-1, టైర్-2 పరీక్షలు, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ మెజర్‌మెంట్స్, ఫిజికల్/ మెడికల్ టెస్టులు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఎస్ఎస్‌సి సీజీఎల్ ప్రాథమిక కీ 2024 చెక్ చేసుకునే విధానం..
అభ్యర్థులు ముందుగా ఎస్ఎస్‌సి అధికారిక వెబ్‌సైట్‌ను ssc.gov.in సంప్రదించగలరు.
వెబ్‌సైట్‌లోని హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఎస్ఎస్సీ సీజీఎల్ ఆన్సర్ కీ 2024 లింక్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేసిన వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
సబ్మిట్పై క్లిక్ చేస్తే ప్రాథమిక కీ విడుదలవుతుంది.
ఆన్సర్ కీని చెక్ చేసి ఆ పేజీని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ప్రింట్ తీసుకోవడం మంచిది.












Click it and Unblock the Notifications