SSC Recruitment: 1800కుపైగా ఎస్ఐ పోస్టుల కోసం వెంటనే అప్లై చేయండి
న్యూఢిల్లీ: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేష్ జారీ చేసింది. ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో సబ్-ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు SSC ప్రధాన కార్యాలయం అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in ద్వారా పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 15.
SSC రిక్రూట్‌మెంట్ వివరాలు:
మొత్తం ఖాళీలు: 1,876 పోస్టులు
ఢిల్లీ పోలీస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ (Exe.)-పురుషులు: 109 పోస్టులు
ఢిల్లీ పోలీస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ (Exe.)-మహిళ: 53 పోస్టులు
CAPFలలో సబ్-ఇన్‌స్పెక్టర్ (GD): 1,714 పోస్టులు

అర్హతలు:
పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరూ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా తత్సమానం నుంచి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో హాజరైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయో పరిమితి:
అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1, 2023 నాటికి 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్:
పురుష అభ్యర్థులు: ఎత్తు: 170 సెం.మీ., ఛాతీ: 80-85 సెం.మీ
గర్హ్వాల్, కుమాన్, హిమాచల్ ప్రదేశ్, గూర్ఖాస్, డోగ్రాస్, మరాఠా, కాశ్మీర్ వ్యాలీ, లేహ్, లడఖ్ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, సిక్కింలోని కొండ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు: ఎత్తు: 165 సెం.మీ., ఛాతీ: 80-85 సెం.మీ.
షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులందరూ: ఎత్తు: 162.5 సెం.మీ., ఛాతీ: 77-82 సెం.మీ.
మహిళా అభ్యర్థులు: ఎత్తు: 157 సెం.మీ
గర్హ్వాల్, కుమావోన్, హిమాచల్ ప్రదేశ్, గూర్ఖాస్, డోగ్రాస్, మరాఠా, కాశ్మీర్ వ్యాలీ, లేహ్, లడఖ్ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, సిక్కింలోని హిల్ ప్రాంతాలకు చెందిన మహిళా అభ్యర్థులు: ఎత్తు: 155 సెం.మీ.
షెడ్యూల్డ్ తెగలకు చెందిన మహిళా అభ్యర్థులందరూ: 154 సెం.మీ
శారీరక దారుఢ్య పరీక్ష:
పురుష అభ్యర్థులకు
16 సెకన్లలో 100 మీటర్ల రేసు
6.5 నిమిషాల్లో 1.6 కిలోమీటర్ల రేసు
లాంగ్ జంప్: 3 అవకాశాలలో 3.65 మీటర్లు
హై జంప్: 3 అవకాశాలలో 1.2 మీటర్లు
షాట్ పుట్ (16 పౌండ్లు): 3 అవకాశంలో 4.5 మీటర్లు
మహిళా అభ్యర్థులకు:
18 సెకన్లలో 100 మీటర్ల రేసు
4 నిమిషాల్లో 800 మీటర్ల రేసు
లాంగ్ జంప్: 3 అవకాశాలలో 2.7 మీటర్లు
హై జంప్: 3 అవకాశాలలో 0.9 మీటర్లు
ఎస్ఎస్‌సీ రిక్రూట్ నోటిఫికేషన్, మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications