SSC రిక్రూట్‌మెంట్: ఇంటర్ అర్హతతో 1207 ఉద్యోగాలు, వెంటనే అప్లై చేయండి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టెనో గ్రాఫర్ పోస్టుల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1207 స్టెనోగ్రాఫర్ సీ (గ్రూప్ బీ, నాన్ గెజిటెడ్), స్టెనోగ్రాఫర్ డీ (గ్రూప్ సీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 23 వరకు ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 1207
వీటిలో స్టెనోగ్రాఫర్ 93 గ్రూప్ C, 1,114 గ్రూప్ D ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్థులు SSC స్టెనోగ్రాఫర్ 2023 కోసం ఆగస్టు 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్ దిద్దుబాటు విండో ఆగస్టు 24 నుంచి 25 వరకు ఇవ్వబడుతుంది.

ఆగస్టు 1, 2023 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు గ్రేడ్ D ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో అనుమతించదగిన సడలింపు ఇవ్వబడుతుందని SSC తెలిపింది.
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష అక్టోబర్‌లో షెడ్యూల్ చేయబడింది. దీనిపై తదుపరి సమాచారం అందిస్తారు.
కంప్యూటర్ ఆధారంగా జరిగే పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాల విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఉండగా, తెలంగాణలో హైదరాబాద్, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
ఈ ఎస్ఎస్సీ రిక్రూట్‌మెంట్‌కు మరిన్ని వివరాలు, నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications