SSC JOBS : నెలకు రూ.1,50,000 వరకు జీతంతో 3003 పోస్టులకు నోటిఫికేషన్
ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా మందికి కలల కెరీర్. అలాంటి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాన్ని స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) మరోసారి అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఒక సువర్ణావకాశం ప్రకటించింది. సర్కారు నౌకరి కోసం ప్రయత్నాలు చేస్తున్న యువతకు ఫేజ్-XIV నోటిఫికేషన్ ద్వారా మంచి ఛాన్స్ అందిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న 3003 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అయితే ఒక అభ్యర్థి తన అర్హతను బట్టి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయవచ్చు. అంతే కాకుండా ప్రతి పోస్టుకు విడిగా ఫీజు చెల్లించాలి. పోస్టింగ్ దేశవ్యాప్తంగా ఎక్కడైనా రావచ్చని.. పరీక్షకు సిద్ధం కావడానికి టైమ్ టేబుల్, మాక్ టెస్టులు చాలా కీలకమని సూచిస్తున్నారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ Staff Selection Commission ను సందర్శించాలని కోరుతున్నారు.

మొత్తం ఖాళీలు..
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 3003 పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టుల సంఖ్య ప్రాంతాల వారీగా, కేటగిరీల వారీగా మారవచ్చు.
పోస్టుల వివరాలు..
ఈ నోటిఫికేషన్‌లో విభిన్న రంగాలకు చెందిన ఉద్యోగాలు ఉన్నాయి. ముఖ్యంగా:
- లాబొరేటరీ అసిస్టెంట్
- డిప్యూటీ రేంజర్
- లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)
- స్టెనోగ్రాఫర్
- అకౌంటెంట్
- జూనియర్ ఇంజినీర్
- సైంటిఫిక్ అసిస్టెంట్
- మార్కెటింగ్ అసిస్టెంట్
- అగ్రికల్చర్ అసిస్టెంట్
- డేటా ఎంట్రీ ఆపరేటర్
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)
- డ్రైవర్, టెక్నీషియన్, స్టోర్ కీపర్
- నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, కోర్ట్ మాస్టర్ వంటి పోస్టులు కూడా ఉన్నాయి
విద్యార్హత..
పోస్టును బట్టి అర్హతలు మారుతాయి:
- 10వ తరగతి (Matriculation)
- ఇంటర్మీడియట్ (12th)
- బ్యాచిలర్ డిగ్రీ
అభ్యర్థులు దరఖాస్తు చివరి తేదీ నాటికి తమ విద్యార్హత సర్టిఫికెట్లు కలిగి ఉండాలి.
వయస్సు పరిమితి..
2026 జనవరి 1 నాటికి:
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 37 సంవత్సరాలు
వయస్సు సడలింపులు:
- OBC: 3 సంవత్సరాలు
- SC/ST: 5 సంవత్సరాలు
- PwBD (దివ్యాంగులు): 10 సంవత్సరాలు
జీతభత్యాలు..
ఎంపికైన అభ్యర్థులకు:
- కనీస జీతం: ₹18,000
- గరిష్ట జీతం: ₹1,50,000 వరకు
పోస్టును బట్టి Pay Level, DA, HRA, ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
ఎంపిక విధానం..
సెలక్షన్ ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది:
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE)
- ధ్రువపత్రాల పరిశీలన
- స్కిల్ టెస్ట్ (కొన్ని పోస్టులకు మాత్రమే)
పరీక్షా నమూనా..
మొత్తం ప్రశ్నలు: 100
మొత్తం మార్కులు: 200
సమయం: 60 నిమిషాలు
విషయాలు:
జనరల్ ఇంటెలిజెన్స్
జనరల్ అవేర్‌నెస్
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ఇంగ్లిష్ లాంగ్వేజ్
ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి
నెగటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత
దరఖాస్తు ఫీజు..
- సాధారణ/ఓబీసీ అభ్యర్థులు: ₹100
- SC/ST/దివ్యాంగులు/ఎక్స్ సర్వీస్‌మెన్: ఫీజు లేదు
దరఖాస్తు గడువు..
ఏప్రిల్ 13, 2026 నుంచి మే 4, 2026 వరకు
ఫీజు చెల్లింపు: మే 5, 2026 వరకు
ఎడిట్ విండో: మే 11-13, 2026
పరీక్ష తేదీ: జూన్ 2026 (అంచనా)
దరఖాస్తు విధానం..
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. ప్రతి పోస్టుకు విడిగా అప్లై చేయాలి.












Click it and Unblock the Notifications