Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TCS Jobs : టీసీఎస్‌లో సర్వీస్ డెస్క్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్... పూర్తి వివరాలివే...

దేశీ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) 'సర్వీస్ డెస్క్ ఎగ్జిక్యూటివ్' రోల్ కోసం ఆసక్తిగల,అనుభవజ్ఞులైన నిపుణుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగిన అభ్యర్థులు ఇందుకు అర్హులు. టీసీఎస్ గ్లోబల్ కస్టమర్స్‌‌కు సర్వీస్ డెస్క్ ఎగ్జిక్యూటివ్ సపోర్టివ్‌గా ఉంటారు.

జాబ్‌కు సంబంధించిన వివరణ :

సర్వీస్ డెస్క్ ఎగ్జిక్యూటివ్ టికెటింగ్ సిస్టమ్‌లో పనిచేయాల్సి ఉంటుంది.టికెట్స్ అసైన్ చేయడం,అప్‌డేట్ చేయడం,రివ్యూ చేయడం చేయాల్సి ఉంటుంది.కస్టమర్స్ సందేహాలను ప్రొఫెషనల్ పద్దతిలో నివృత్తి చేయాల్సి ఉంటుంది.సంక్లిష్టమైన టెక్నికల్ సమస్యలను సైతం కస్టమర్స్ లేదా క్లయింట్స్‌కు చాలా సింపుల్‌గా వివరించగలిగే నైపుణ్యం కలిగి ఉండాలి.అభ్యర్థులకు మంచి టెక్నికల్ నాలెడ్జి ఉండాలి. మీరు ఈ జాబ్‌కు అప్లై చేయాలనుకుంటే... పైన పేర్కొన్న అంశాలపై మంచి పట్టు కలిగి ఉండాలి.

tcs invites applications for Service Desk Executive role to support Global Customers

విద్యార్హత,ఇతర అర్హతలు :

ఈ జాబ్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస విద్యార్హత బీఏ(డిగ్రీ).అంటే అభ్యర్థులు కనీసం డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.కనీసం ఒక ఏడాదికి పైగా సర్వీస్ డెస్క్‌లో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.

దరఖాస్తుకు చివరి గడువు :

ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 30,2021 లోపు ఈ జాబ్‌కు దరఖాస్తు చేసుకోవాలి.

ఇటీవలే టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీస్) 'రీబిగిన్' పేరుతో భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ డ్రైవ్ ద్వారా పెద్ద ఎత్తున మహిళా ప్రొఫెషనల్స్‌ను రిక్రూట్ చేసుకోనున్నారు.ప్రతిభావంతులైన, అనుభవజ్ఞులైన మహిళా నిపుణులకు స్పూర్తినిచ్చేలా,తమను తాము మళ్లీ ఆవిష్కరించుకునేలా,తమను తాము ఛాలెంజ్ చేసుకునేలా ఈ కొత్త అవకాశాలు వారికి ఎంతగానో ఉపయోగపడుతాయని టీసీఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది.వ్యక్తిగత కారణాలు లేదా వృత్తిపరమైన కారణాలతో సుదీర్ఘ కాలం జాబ్‌కు దూరంగా ఉన్న మహిళా నిపుణులకు 'రీబిగిన్' చక్కని అవకాశమని టీసీఎస్ తెలిపింది. కనీసం రెండేళ్ల పాటు మధ్యలో ఎటువంటి బ్రేక్ లేకుండా ఐటీ రంగంలో పనిచేసిన మహిళలు 'రీబిగిన్' ప్రోగ్రామ్‌కు అప్లై చేసుకునేందుకు అర్హులని వెల్లడించింది. ఔత్సాహిక అభ్యర్థులు ఫుల్ టైమ్ డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలని తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+