తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష రుసుం చెల్లింపు తేదీలను రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా నవంబర్ 18 వరకు చెల్లించుకునేందుకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత రూ. 50 ఆలస్య రుసుంతో డిసెంబర్ 2 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
ఇక, రూ. 200 ఆలస్య రుసుంతో డిసెంబర్ 12 వరకు, రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 21 వరకు చెల్లించుకోవచ్చని పరీక్షల విభాగం సంచాలకులు వెల్లడించారు. కాగా, ఫీజు చెల్లించే గడువు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించే ప్రసక్తి లేదని సంచాలకులు స్పష్టం చేశారు.

రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125 పరీక్ష రుసుము కింద చెల్లించాల్సి ఉంటుంది. మూడు, అంతకంటె తక్కువ సబ్జెక్టులకు రూ. 110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఉంటే రూ. 124 చెల్లించాల్సి ఉంటుంది. ఒకేషనల్ విద్యార్థులు రూ. 125లతో పాటు మరో రూ. 60 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలివే
తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి, రెండో ఏడాదికి సంబంధించి పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డ్ ఇటీవల ఖరారు చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 6 నుంచి 26 వరకు ఎగ్జామ్ ఫీజులను చెల్లించేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 100 రూపాయల అపరాధ రుసుముతో(ఫైన్) నవంబర్ 27 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది.
అదే విధంగా ఇంటర్ మొదటి, రెండో ఏడాదిలకు సంబంధించి పరీక్ష ఫీజుల వివరాలను కూడా తెలిపింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ జనరల్ విద్యార్థులకు రూ.520, ఒకేషనల్ విభాగం వారు రూ.750 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జనరల్ ఆర్ట్స్ విభాగం వారు రూ.520 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ సైన్స్ వారు రూ.750, ఒకేషనల్ విద్యార్థులు రూ.750 చెల్లించాలి.
ఇంటర్ పరీక్షల ఫీజులకు సంబంధించి ముఖ్యమైన తేదీలు:
పరీక్ష ఫీజు చెల్లించేందుకు తేదీలు : నవంబర్ 6 నుంచి 26
100 రూపాయల ఫైన్‌తో : నవంబర్ 27 నుంచి డిసెంబర్ 4 వరకు చెల్లించవచ్చు
ఫస్ట్ ఇయర్ జనరల్ విద్యార్థులకు : రూ.520 చెల్లించాలి
ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ విద్యార్థులకు : రూ.750 చెల్లించాలి
ఇంటర్ సెకండ్ ఇయర్ జనరల్ విద్యార్థులు : రూ.520
ఇంటర్ సెకండ్ ఇయర్ జనరల్ సైన్స్ వారు : 750
ఇంటర్ సెకండ్ ఇయర్ ఒకేషనల్ విద్యార్థులు : రూ.750.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications