రేపట్నుంచి అందుబాటులోకి తెలంగాణ కానిస్టేబుల్ తుది పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’
హైదరాబాద్: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిలిమినరీ 'కీ'ని మే 22న https://www.tslprb.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు పోలీస్ నియామక మండలి(TSLPRB) వెల్లడించింది. కానిస్టేబుల్ సివిల్, పీసీ డ్రైవర్, మెకానిక్, ట్రాన్స్‌పోర్ట్ , ఎక్సైజ్, ఐటీ తత్సమాన పోస్టులకు నిర్వహించిన తుది పరీక్ష ప్రిలిమినరీ కీ సోమవారం అందుబాటులోకి రానుంది.
'కీ'లో ఏమైనా అభ్యంతరాలుంటే మే 24 సాయంత్రం 5 గంటలలోపు.. నిర్దేశిత ప్రొఫార్మా ప్రకారం వెబ్‌సైట్‌లో చేయాలని సూచించింది. ఇందుకోసం ప్రత్యేక ప్రొఫార్మా వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. అభ్యంతరం ఉన్న ఒక్కో ప్రశ్నకు ప్రొఫార్మా ప్రకారం నమోదు చేయాలని.. ఇందుకు సంబందించిన డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేయాలని తెలిపింది. అసంపూర్తిగా అభ్యర్థన ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేసింది.

అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లను ఫైనల్ 'కీ'ని విడుదల చేసే సమయంలో వారి లాగిన్‌లో ఉంచనున్నట్లు వెల్లడించింది. కాగా, తెలంగాణ పోలీసు నియామక మండలి నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష ఏప్రిల్ 30న జరిగింది. తుది పరీక్షల్లో.. 1,09,663 మంది సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులు గానూ, 1,08,055 మంది పరీక్షకు హాజరయ్యారు. ఐటీ అండ్ కమ్యూనికేషన్ అభ్యర్థుల్లో 6,801 మందికి గానూ 6,088 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. సివిల్ కానిస్టేబుల్ విభాగంలో 98.53 శాతం, ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో 89.52 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు.
కాగా, TSLPRB జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,969 కానిస్టేబుల్ పోస్టుల కోసం తుది పరీక్షకు 1,75,657 మంది అర్హత సాధించారు. ఈ క్రమంలో ఒక్కో పోస్టుకు 11 మంది వరకు పోటీ నెలకొంది. అయితే, కీలకమైన సివిల్ విభాగంలో అధికంగా 15,644 పోస్టులున్నాయి. వీటి కోసం 90,488 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఒక్కో పోస్టుకు 25 మంది, మెకానిక్ విభాగంలో 56 మంది, డ్రైవర్ విభాగంలో 65 మంది, రవాణా విభాగంలో 143 మంది, ఎక్సైజ్‌శాఖలో 97 మంది, అగ్నిమాపకశాఖ ఆపరేటర్ విభాగంలో 12 మంది పోటీలో ఉన్నారు. భారీ సంఖ్యలో పోస్టులు ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగంపై అభ్యర్థులు పెద్ద ఆశలే పెట్టుకున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications