తెలంగాణ కానిస్టేబుల్ నియామకాలకు బ్రేక్: హైకోర్టు ఆదేశాలు ఇలా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సివిల్ కానిస్టేబుల్ కొత్త నియామకాలకు బ్రేక్ పడింది. నాలుగు ప్రశ్నలను తొలగించి మరోసారి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాత తాత్కాలిక ఎంపిక జాబితా ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
కాగా, సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించిన రాత పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయకపోవడంతో తాము నష్టపోయామని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలోని 122, 130, 144 ప్రశ్నలను తెలుగులోకి అనువదించలేదని.. 57వ ప్రశ్న తప్పుగా ఉన్నందున వాటిని ప్రశ్నాపత్రం నుంచి తొలగించాలని హైకోర్టు టీఎస్ఎల్పీఆర్బీ (TSLPRB)ను ఆదేశించింది.

రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం పోలీసు నియామక మండలి గత ఏడాది ఏప్రిల్ 25న నోటిపికేషన్ విడుదల చేసింది. సివిల్ కానిస్టేబుల్ కు సంబంధించి 4965 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష రాశారు. అయితే, ఇందులో 3 ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయకపోవడంతోపాటు ఒక ప్రశ్న తప్పుగా ఇవ్వడంతో సమాధానాలు రాయలేకపోయామని పలువురు అభ్యర్థులు పిటీషన్లలో పేర్కొన్నారు.
ఇంటర్ వరకు చదువుకున్న అభ్యర్థులు.. ఇంగ్లీషులో ప్రశ్నలు ఉండటంతో గందరగోళానికి గురై సమాధానం రాయలేక నష్టపోయారని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇంగ్లీష్ లో ఇచ్చిన ఐచ్చికాలు వాడుకలో ఉన్నవేనని పోలీసు నియామక మండలి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఇంగ్లీష్ పదాలను తెలుగులో అనువాదం చేసే అవకాశం ఉన్నా.. పరిగణలోకి తీసుకోకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది.
నాలుగు ప్రశ్నలను తొలగించి ఆ తర్వాత మూల్యాంకనం చేయాలని.. దాని ఆధారంగా తాత్కాలిక జాబితా రూపొందించి ఆ తర్వాతే నియామక ప్రక్రియ కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్ఎల్పీఆర్బీ గత బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థుల పూర్తి వివరాలను కూడా సేకరిస్తున్నారు. ప్రస్తుతం హైకోర్టు తీర్పుతో ఈ ప్రక్రియ మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications