తెలంగాణ ఈఏపీసెట్ సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల
తెలంగాణ ఎంసెట్ పేరును టీఎస్ ఈఏపీసెట్‌గా మారుస్తూ ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల తేదీలు, వర్సిటీలు ఖరారు చేసింది.
మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. మే 12, 13 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష, మే 6న టీఎస్ ఈ సెట్ పరీక్షను నిర్వహిస్తారు. జూన్ 4న ఐసెట్ ప్రవేశ పరీక్ష, జూన్ 6 నుంచి 8 వరకు టీఎస్ పీజీఈసెట్ పరీక్షలు జరగనున్నాయి.

తెలంగాణ ఈసెట్- మే 6 (ఉస్మానియా వర్సిటీ)
టీఎస్ ఈఏపీసెట్(ఇంజినీరింగ్)- మే 9 నుంచి 11 వరకు, (అగ్రికల్చరల్ అండ్ ఫార్మా) మే 12, 13 జేఎన్టీయూహెచ్
టీఎస్ ఎడ్‌సెట్ : మే 23, మహాత్మాగాంధీ యూనివర్సిటీ
టీఎస్ లా సెట్: పీజీ ఎల్ సెట్: జూన్ 3, ఉస్మానియా యూనివర్సిటీ
టీఎస్ ఐసెట్: జూన్ 4,5, కాకతీయ యూనివర్సిటీ
టీఎస్ పీజీఈసెట్: జూన్ 6 నుంచి 8 వరకు, జేఎన్టీయూహెచ్
టీఎస్ పీఈసెట్: జూన్ 10 నుంచి 13 వరకు, శాతవాహన యూనివర్సిటీ
కాగా, ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు, షెడ్యూల్, రిజిస్ట్రేషన్, ఫీజు తదితర వివరాలను సంబంధిత పరీక్షల కన్వీనర్లు వెల్లడిస్తారని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications