తెలంగాణ ఈఏపీసెట్ షెడ్యూల్ విడుదల: పరీక్షలు ఎప్పుడంటే?

తెలంగాణ ఈఏపీసెట్ (TS EAPCET) 2024 షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 21న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు.

మే 9 నుంచి 12 వరకు తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. మంగళవారం సెట్ కమిటీ సమావేశంలో ఈ షెడ్యూల్ ఆమోదించినట్లు కుమార్ తెలిపారు. గతంలో టీఎస్ ఎంసెట్‌గా పేర్కొనే ఈ పరీక్షకు టీఎస్ ఈఏపీసెట్‌గా ఇటీవలే మార్పు చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరగనుంది.

telangana eapcet-2024 schedule released

కాగా, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ హైదరాబాద్ (JNTUH), తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE)లకు సంబంధించిన సీనియర్ అధికారులు మంగళవారం తెలంగాణ ఈఏపీసెట్-2024 మొదటి సెట్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో TS EAPCET షెడ్యూల్ ఖరారు చేశారు. తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 సిలబస్‌పై కూడా స్పష్టత ఇచ్చింది. TS EAPCET సిబలస్‌లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం సిలబస్‌ వంద శాతం ఉంటుందని షెడ్యూల్‌లో వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+