తెలంగాణ గ్రూప్ 3 ఉద్యోగాల కోసం వెంటనే అప్లై చేయండి
గ్రూప్-3 సర్వీసు ఉద్యోగాలకు గత డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1363 పోస్టుల కోసం జనవరి 24 నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. గ్రూప్-3 సర్వీసు ఉద్యోగాలకు గత డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1363 పోస్టుల కోసం జనవరి 24 నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 23 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఆబ్జెక్టివ్ రూపంలో ఉండే ఈ పరీక్షను జులై లేదా ఆగస్టు నెలలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు టీఎస్ పీఎస్సీ పేర్కొంది. అయితే, ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తారా? లేక ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహిస్తారా? అనేదానిపై స్పష్టత లేదు.

కాగా, పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచిచూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ సూచించింది.
మరిన్ని వివరాలు, పూర్తి నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications