తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల: ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 5, 6 తేదీల్లో నిర్వహించిన ఐసెట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఐసెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, కాకతీయ యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీ వాకాటి కరుణ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు.
ఐసెట్ పరీక్ష కోసం 86 వేల 156 మంది దరఖాస్తు చేసుకోగా.. 77,942 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 71, 647 మంది ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత 91.92 శాతంగా నమోదైంది. ఎంబీఏ 272 కాలేజీల్లో 35, 949 సీట్లు ఉండగా.. ఎంసీఏ 64 కాలేజీల్లో 6, 990 సీట్లు ఉన్నాయి.

ఐసెట్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. జూన్ 5, 6 తేదీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 116 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 77,942 మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏడాది ఐసెట్ ప్రవేశ పరీక్షను వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ నిర్వహించింది.
కాగా, తెలంగాణ ఐసెట్ పరీక్షలో వచ్చిన ర్యాంకు ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
ఐసెట్ ఫలితాలు ఇలా చూసుకోండి
icet.tsche.ac.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
హోమ్‌పేజీలో TS ICET 2024 ఫలితాలను తనిఖీ చేయడానికి లింక్ కోసం చూడండి. దాన్ని క్లిక్ చేయండి
కొత్త పేజీ పాపప్ అవుతుంది. అభ్యర్థులు లాగిన్ వివరాలను సమర్పించాలి
లాగిన్ వివరాలను సమర్పించిన తర్వాత, అభ్యర్థులు తమ ఫలితాలను చూడవచ్చు
స్కోర్ కార్డ్‌లోని వివరాలను ధృవీకరించండి. పేజీని సేవ్ చేయండి
భవిష్యత్తు అవసరాల కోసం పేజీని డౌన్‌లోడ్ చేసి, స్కోర్ కార్డ్ ప్రింట్ అవుట్ తీసుకోండి.












Click it and Unblock the Notifications