Jobs: నెలకు రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల జీతం వచ్చే ఉద్యోగాలు..!
విదేశాల్లో పని చేయడానికి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ఉద్యోగులను రిక్రూట్మెంట్ చేసుకుంటోంది. తాజాగా హైదరాబాద్‌లో స్టాఫ్ నర్సులను నియమించుకోవడానికి సిద్ధమైంది. ఎంపికైన వారు యూకేలో శిక్షణ, ఉద్యోగాలు పొందనున్నారు. ఈ కార్యక్రమం యూకేలో పనిచేయడానికే కాదు.. అంతర్జాతీయ అనుభవాన్ని పొందేందుకు కూడా అవకాశం కల్పిస్తోంది. అధిక-వేతనంతో కూడిన ఉద్యోగాలను పొందేందుకు తెలంగాణ యువ నిపుణులకు మంచి అవకాశాలను కూడా అందిస్తుంది.
అర్హతల
మానసిక ఆరోగ్య సంరక్షణలో కనీసం ఆరు నెలల అనుభవంతో జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ (GNM) లేదా BSc నర్సింగ్ పూర్తి చేయాలి. ఆక్యుపేషనల్ ఇంగ్లీష్ టెస్ట్ (OET) స్కోర్‌లలో వినడం, చదవడం మాట్లాడటంలో కనీసం B గ్రేడ్, రాయడంలో కనీసం C+ గ్రేడ్ రావాలి. దరఖాస్తు చేసుకోవడానికి ప్రెషర్స్ అవకాశం ఉన్నా.. నర్సింగ్ అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయోపరిమితి లేదు.

జీతం
యూకేలో ఉద్యోగాల కోసం ఎంపికైన అభ్యర్థులకు మానసిక ఆరోగ్యంపై 3-నెలల ఫౌండేషన్ కోర్సు (ఆన్‌లైన్) ఉచితంగా అందిస్తారు. ఈ కోర్సు వీసా ప్రాసెసింగ్ దశలో నేర్పుతారు. ఆ తర్వాత ఇండియా, యూకే రెండింటిలోనూ ఆబ్జెక్టివ్ స్ట్రక్చర్డ్ క్లినికల్ ఎగ్జామినేషన్ (OSCE) ఉంటుంది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ తెలిపిన ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ ఆదాయాన్ని రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు.
దరఖాస్తు విధానం
యూకేలో ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరింత సమాచారం కోసం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. రిజిస్ట్రేషన్ వివరాల కోసం 8919047600 నంబర్‌ను సంప్రదించవచ్చు. కొద్ది రోజుల క్రితం టామ్ కామ్ జ పాన్ స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్స్ (SSW) పథకం కింద నియామకాలు చేపట్టింది.












Click it and Unblock the Notifications