తెలంగాణ ఎస్ఐ పరీక్ష తేదీలను ప్రకటించిన TSLPRB: 3 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
హైదరాబాద్: తెలంగాణ ఎస్ఐ పోస్టులకు ఫైనల్ రాత పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎఎస్ఎల్‌పీఆర్‌బీ(TSLPRB) ప్రకటించింది. రాత పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటాయని టీఎఎస్ఎల్‌పీఆర్‌బీ అధికారులు వెల్లడించారు.
ఏప్రిల్ 3 నుంచి 6 వరకు అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. హాల్ టికెట్‌పై ఫొటో తప్పనిసరిగా ఉండాలని సూచించారు అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం, హాల్ టికెట్ డౌన్‌లోడ్ కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.tslprb.in/ సంప్రదించవచ్చని తెలిపారు.

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు
తెలంగాణ ఎంసెట్(TS EAMCET) పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు వెల్లడించారు.
నీట్(NEET), టీఎస్‌పీఎస్సీ(TSPSC) పరీక్షల కారణంగానే ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీంల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులూ లేవని.. మే 10, 11 తేదీల్లోనే ఈ పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications