తెలంగాణ సచివాలయంలో పలు ఉద్యోగాలు: అప్లై చేయండి

హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో పలు ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 23 పోస్టులను కొత్తగా మంజూరు చేసింది. ఈ పోస్టుల్లో 3 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, 20 భద్రతా విభాగం సిబ్బంది పోస్టులు ఉన్నాయి.

కాగా, ఈ పోస్టులన్నింటినీ ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు ఆర్థిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. తాజాగా మంజూరు చేసిన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Telangana

ఐసీఎంఆర్ఎఫ్‌బీఆర్ హైదరాబాద్‌లో పలు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్ నగరంలోని ఐసీఎంఆర్-నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్(ఎన్ఏఆర్ఎఫ్‌బీఆర్).. డైరెక్టర్ రిక్రూట్‌మెంట్ ద్వారా 46 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:

మొత్తం పోస్టులు: 46

టెక్నికల్ అసిస్టెంట్: 3

టెక్నీషియన్-1: 8

ల్యాబ్ అటెండెంట్-1: 35

అర్హతలు:
పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీతోపాటు పని అనుభవం.

వయో పరిమితి:
టెక్నికల్ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు, టెక్నీషియన్‌కు 28 ఏళ్లు, ల్యాబ్ అటెండెంట్‌కు 25 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ:
ఆఫ్‌లైన్ దరఖాస్తులు 'డైరెక్టర్, ఎన్ఏఆర్ఎఫ్‌బీఆర్', జీనోమ్ వ్యాలీ, కొల్తూర్(పోస్టు), శామీర్‌పేట్(మండలం), హైదరాబాద్' చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 14, 2023

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://narfbr.org/ సంప్రదించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+