నేడే టెట్ హాల్‌టిక్కెట్లు విడుదల... ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
టిఎస్ టెట్ హాల్‌టిక్కెట్లు విడుదలయ్యాయి. టెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు బుధవారం (మే 15) నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ టెట్ పరీక్షలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 2వ తేది వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. తెలంగాణ ఎస్‌సీఈఆర్టీ అధికారులు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. తొలిసారిగా తెలంగాణ టెస్ పరీక్షలు సీబీటి విధానంలో జరగనున్నాయి. అంటే ఈ పరీక్షలు ఆన్‌లైన్‌లో ఉండనున్నాయి. రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి.
ఉదయం ఒక సెషన్, మధ్యాహ్నం మరో సెషన్ ఉంటుంది. ఇక, ఈ సంవత్సరం టెట్ పరీక్షకు 2.86లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 48,582 మంది సర్వీస్ టీచర్లు కూడా టెట్‌కు అప్లయ్ చేసుకోవడం జరిగింది. పరీక్షలు ముగిసిన తర్వాత వెంటనే ప్రిలిమినరీ కీ, ఫైనల్ కీ విడుదల చేస్తారు. తుది ఫలితాలను జూన్ 12వ తేదీన విడుదల చేస్తారు. టెట్ అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి https://tstet2024.aptonline.in/tstet/ హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోగలరు.

డీఎస్సీ పోస్టుల భర్తీలో టెట్ స్కోర్‌కు వెయిటేజీ ఉంటుంది. టెట్ క్వాలిఫ్లై అయిన వారే డీఎస్సీ పరీక్షలు రాసేందుకు అర్హులు. టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (డీఎస్సీ) కు 80 శాతం కాగా.. టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్ పరీక్షలు రాసే అభ్యర్థులు డీఈడీ, బీఈడీ అర్హత సాధించి ఉండాలి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో రెండు పేపర్లు ఉంటాయి.
అవి పేపర్-1, పేపర్-2. టెట్ పేపర్-1కి డీఈడీ అర్హత కలిగి వున్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్‌లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ అభ్యర్థులు 2015లోపు డీఈడీ చేసిఉంటే జనరల్ అభ్యర్థులకు ఇంటర్‌లో 45 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా టెట్ రాసుకోవచ్చు. టెట్ పేపర్-2కి మాత్రం డిగ్రీ, బీఈడీ తప్పనిసరి.












Click it and Unblock the Notifications