TG DSC 2024 : డీఎస్సీ ప్రాథ‌మిక కీ విడుద‌ల‌.. ఇలా చెక్ చేసుకోండి..

డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. తెలంగాణ డీఎస్సీ ప్రాథ‌మిక కీ విడుద‌ల‌య్యింది. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ నోటిఫికేష‌న్‌లో భాగంగా డీఎస్సీ ప‌రీక్ష‌లు జులై 18వ తేదిన ప్రారంభ‌మ‌య్యి, ఈ నెల 5వ తేదిన ముగిసాయి. ఇక‌, తాజాగా ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ప్రాథ‌మిక కీ ని అధికారులు విడుద‌ల చేశారు. ఈ ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రిలిమిన‌రీ కీని చెక్‌చేసుకోగ‌ల‌రు.

ప్రిలిమినరీ 'కీ'తో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచ‌డం జ‌రిగింది. ఇక‌, ఈ ప్రాథ‌మిక 'కీ'పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల (ఆగస్టు) 20వ తేదీలోగా ఆన్‌లైన్‌లో తెలుపగ‌ల‌రు. అభ్య‌ర్థులు తెలంగాణ డీఎస్సీ ప్రిలిమిన‌రీ కీ కోసం తెలంగాణ‌ కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://tgdsc.aptonline.in/tgdsc/ స‌ంప్ర‌దించ‌గ‌ల‌రు.

TG DSC 2024 DSC Primary Key Release Check This

రాష్ట్రంలో ఫిబ్రవరి 28వ తేదీన 11,062 ఉపాధ్యాయ పోస్టులకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. ఇందులో ఎస్జీటీలు 6,508 పోస్టులు ఉండ‌గా, స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629 పోస్టులు, భాషా పండితులు (ఎల్‌పి) 727 పోస్టులు, పీఈటీలు 182 పోస్టులు, ప్రత్యేక విభాగంలో స్కూల్‌ అసిస్టెంట్లు 220 పోస్టులు, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలు జులై 18వ తేదీన ప్రారంభమై, ఈ నెల 5 తేదీన ముగిసాయి. ఇక‌, ఈ ప‌రీక్ష‌కు మొత్తం 2,79,957 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 2,45,263 మంది (87.61 శాతం) ప‌రీక్ష రాశారు. 34,694 మంది పరీక్షకు హాజ‌రుకాలేదు. ఇక‌, వీరిలో అత్యధికంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు 92.10 శాతం మంది ప‌రీక్ష రాశారు. ఈ ప‌రీక్ష‌లు సీబీఆర్‌టీ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో జ‌రిగాయి. ఇక‌, తాజాగా ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ ని పాఠ‌శాల విద్యాశాఖ విడుద‌ల చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+