TG TET 2026 షెడ్యూల్ రిలీజ్.. ఎప్పుడు ఏ ఎగ్జామ్ అంటే ??
తెలంగాణ పాఠశాల విద్యా శాఖ TS TET / TG TET 2026 (Teacher Eligibility Test) పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఉపాధ్యాయ వృత్తిని ఆశిస్తున్న అభ్యర్థులకు ఇది కీలక సమాచారం. ఈ పరీక్షలు 2026 జనవరి 3 నుంచి జనవరి 31 వరకు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో (CBT) నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
హాల్ టికెట్లు, ఫలితాల తేదీలు..
TG TET 2026కు సంబంధించిన హాల్ టికెట్లు 2025 డిసెంబర్ 27న విడుదల చేయనున్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ tgtet.aptonline.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలు పూర్తైన అనంతరం ఫలితాలు 2026 ఫిబ్రవరి 10 నుంచి 16 మధ్యలో ప్రకటించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

TG TET 2026 పరీక్ష విధానం..
ఈ ఉపాధ్యాయ అర్హత పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్ - I: 1 నుంచి 5వ తరగతులు బోధించేవారికి
పేపర్ - II: 6 నుంచి 8వ తరగతులు బోధించేవారికి
అభ్యర్థులు తమ అర్హత, బోధనా స్థాయిని బట్టి ఒకటి లేదా రెండు పేపర్లకు హాజరుకావచ్చు.
పరీక్ష సమయాలు (షిఫ్ట్‌లు)..
TG TET 2026 పరీక్షలు ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు:
ఉదయం షిఫ్ట్: 9:00 AM - 11:30 AM
మధ్యాహ్నం షిఫ్ట్: 2:00 PM - 4:30 PM
ప్రతి పేపర్‌కు 2 గంటల 30 నిమిషాల సమయం కేటాయించబడింది.
ప్రశ్నాపత్రం నమూనా & మార్కులు..
మొత్తం మార్కులు: 150
ప్రతి ప్రశ్నకు: 1 మార్కు
నెగెటివ్ మార్కింగ్ లేదు
అధికారిక షెడ్యూల్ ప్రకారం..
జనవరి 3, 4: పేపర్-II (గణితం & సైన్స్)
జనవరి 5, 6: పేపర్-II (సాంఘిక శాస్త్రం)
జనవరి 8, 9, 11: పేపర్-I
జనవరి 19: పేపర్-I (మైనర్ మీడియం)
జనవరి 20: పేపర్-II (మైనర్ - గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం)
అన్ని పరీక్షలు రెండు షిఫ్టుల్లోనే నిర్వహించబడతాయి. అభ్యర్థులు తమ ఖచ్చితమైన తేదీ, షిఫ్ట్ వివరాలను హాల్ టికెట్‌లో తప్పనిసరిగా పరిశీలించాలి. అలానే పరీక్ష కేంద్రానికి హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ హార్డ్ కాపీ, చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు (ఆధార్ / పాన్ / డ్రైవింగ్ లైసెన్స్) తీసుకురావాలి. పరీక్ష కేంద్రానికి కనీసం 1.5 గంటల ముందే చేరుకోవాలి. ఆలస్యంగా వచ్చిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదు.
నిషేధిత వస్తువులు & భద్రతా సూచనలు..
పరీక్ష హాల్‌లోకి సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ డివైజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు తీసుకురావడం పూర్తిగా నిషిద్ధం. పర్యవేక్షకుల సూచనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
పేపర్ - I సిలబస్ నిర్మాణం..
పేపర్ - Iలో మొత్తం 5 విభాగాలు ఉంటాయి:
భాష - I
భాష - II (ఇంగ్లీష్)
గణితం
బాలల వికాసం & పెడగాగి
పర్యావరణ అధ్యయనం
పేపర్ - II సిలబస్ నిర్మాణం..
పేపర్ - IIలో మొత్తం 4 విభాగాలు ఉంటాయి:
భాష - I (30 మార్కులు)
భాష - II (ఇంగ్లీష్ - 30 మార్కులు)
బాలల వికాసం & పెడగాగి (30 మార్కులు)
డొమైన్ సబ్జెక్ట్
గణితం & సైన్స్ లేదా
సాంఘిక శాస్త్రం
60 ప్రశ్నలు - 60 మార్కులు
TG TET 2026 - అభ్యర్థులకు కీలక సూచన..
TG TET సర్టిఫికెట్ పొందడం ద్వారా తెలంగాణలో జరిగే ఉపాధ్యాయ నియామకాలకు అర్హత లభిస్తుంది. అందువల్ల అభ్యర్థులు పరీక్షకు ముందు పూర్తి సిలబస్‌ను పునశ్చరణ చేసుకొని, మాక్ టెస్టులు రాసి సిద్ధమవడం ఉత్తమం.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications