రేపే గ్రూప్-4 పరీక్ష: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ కీలక సూచనలు, మహిళా అభ్యర్థుల తనిఖీపై స్పష్టత

హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-4 పరీక్ష రేపు(జులై 1-శనివారం) జరగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాల, కళాశాలలకు రాష్ట్ర విద్యాశాఖ సెలవు ప్రకటించింది. అయితే ఇందుకు ప్రత్యామ్నాయంగా జులై 8న రెండో శనివారం రోజును వర్కింగ్ డే గా ప్రకటించింది.

రాష్ట్రంలో మొత్తం 8,801 గ్రూప్-4 పోస్టులు ఉన్నాయి. వీటి భర్తీకి జులై1 న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం రాష్ట్రంలో దాదాపు 2,846 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 9.51 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. రెండు సెషన్స్‌లో గ్రూప్-4 పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10.00 AM నుంచి మధ్యాహ్నం 12.30 పేపర్-1 పరీక్ష ఉంటుంది. అలాగే రెండవ సెషన్‌లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది.

tspscgroup4exam

పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులకు ఉదయం 9.45 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2.15 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని టీఎస్‌పీఎఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల పలు పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ఎదురైన అనుభవాల దృష్ట్యా టీఎస్పీ‌పీఎస్సీ కీలక సూచనలు చేయడంతోపాటు పలు అంశాలపై స్పష్టతనిచ్చింది. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ముందు సెక్యూరిటీ సిబ్బందికి, పరీక్ష గదిలోకి చేరుకున్న తర్వాత ఇన్విజిలేటర్‌కు అభ్యర్థులు తమ ఫొటో గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందన్నారు.

మహిళా అభ్యర్థులు పరీక్ష రాయాలంటే తాళిబొట్టు, మెట్టెలు తీసేయాలని నిబంధన పెడుతున్నారని నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పలు పరీక్షలకు హాజరైన మహిళ అభ్యర్థుల తాళి బొట్టు, మెట్టెలు, చెవి దుద్దులు కూడా తీసేయించి పరీక్ష హాల్లోకి అనుమతిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. పరీక్ష పేరుతో సంప్రదాయాలను కించపరుస్తున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి వివరణ ఇచ్చారు. పరీక్షకు హాజరయ్యే మహిళలు తాళిబొట్టు, మెట్టెలు తీసేయాలని రూల్స్ ఏమీ లేవని ఆయన స్పష్టంచేశారు. యువతీయువకుల కోసం ప్రత్యేకంగా చెక్ పాయింట్లు ఉంటాయని, అందుకు సరిపడా మహిళా సిబ్బందిని కూడా నియమించామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+