TS DSC : డీఎస్సీ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం..నాన్‌లోక‌ల్ అభ్య‌ర్థుల‌కు షాక్‌!

తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌యిన విష‌యం తెలిసిందే. ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ‌మైంది. మార్చి4న రాత్రి 12 గంటల నుంచే ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియను ప్రారంభించారు. ఏప్రిల్‌ 3 వరకు అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

అయితే, గతేడాది డీఎస్సీకి ద‌ర‌ఖాస్తు చేసిన వారు మ‌ళ్లీ చేయ‌న‌వ‌స‌రం లేదని పేర్కొన్నారు. ఇప్ప‌టికే జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న‌పోస్టుల వివ‌రాలు విద్యాశాఖ ప్ర‌క‌టించింది. అభ్య‌ర్థుల స్థానిక‌త విష‌యంలో ప‌లు మార్పుల‌ను చేసింది. అభ్య‌ర్థుల స్థానిక‌త‌ను నిర్ధారించేందుకు గ‌తంలో నాలుగు నుంచి ప‌ది త‌ర‌గ‌తుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం జ‌రిగేది.

TS DSC application process starts Shock for non-local candidates

కానీ, ఇప్ప‌డు వాటిలో మార్ప‌లు చేశారు. తాజాగా 1నుంచి 7వ త‌ర‌గ‌తుల‌ను లెక్క‌లోకి తీసుకోవ‌డం జ‌రుగుతుంది. డీఎస్సీ కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష తేదీల‌ను ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. ఈ ప‌రీక్షల తేదీలను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని విద్యాశాఖ ప్ర‌క‌టించింది. డీఎస్సీ సిల‌బ‌స్‌లో ఎలాంటి మార్పు జ‌ర‌గ‌లేదు. తాజాగా జిల్లాల వారీగా ఏ సబ్జెక్టుకు ఎన్ని ఖాళీలు, వాటికి సంబంధించిన రోస్టర్‌ను విడుదల చేయ‌డం జ‌రిగింది. అభ్య‌ర్థులు ఈ వెబ్‌సైట్‌ https://schooledu.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. డీఎస్సీకి ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకునేవారు తెలంగాణ టెట్‌, ఏపీ టెట్‌, లేదా సీ టెట్‌లో అర్హ‌త సాధించి ఉండాలి.

అర్హ‌త‌లివే..

సెకండరీ గ్రేడ్‌ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు కేవలం డీఎడ్‌ పూర్తి చేసిన వారే అర్హులని బీఎడ్ వారికి అర్హ‌త లేద‌ని స్ప‌ష్టం చేశారు.బీఎడ్‌, డీఎడ్‌ చివరి సంవత్సరం/చివరి సెమిస్టర్‌ పరీక్షలు రాసినవారు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు. వారికి డీఎస్సీ వెరిఫికేషన్‌ నాటికి ధ్రువీకరణపత్రాలు అందించాల్సి ఉంటుంది. ఎస్‌ఏ ఉద్యోగాలకు సంబంధిత విధానంలో బీఎడ్‌ పూర్తి చేసిన వారు అర్హులు. నాలుగేళ్ల బీఎడ్‌ పూర్తి చేసిన వారూ పోటీపడొచ్చు. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

దీంతోపాటు యూజీ డీపీఈడీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. డిగ్రీ పూర్తిచేసినవారు.. బీపీఈడీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, గతంలో లోకల్‌, ఓపెన్‌కోటా రిజర్వేషన్‌ 80:20 పద్ధతిలో ఉండగా, తాజాగా 95:5 రేషియోను అమలు చేయ‌నున్నారు. అభ్యర్థులు 1-7-23 తేదీనాటికి 46 సంవత్సరాలు గలవారై ఉండాలి. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వారికి 5ఏళ్లు, మాజీ సైనికులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+