టీఎస్ ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదల: గోరింటాకు, టాటూలు వేసుకోవద్దు!
తెలంగాణలో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు జరగనున్న టీఎస్ ఈఏపీసెట్ (TS EAPCET) పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఫార్మసీ విభాగానికి సంబంధించిన హాల్ టికెట్లను మాత్రమే అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి తమ హాల్ టికెట్లు పొందవచ్చు.
హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇంజినీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్లను మే 1న అందుబాటులోకి తేనున్నారు. మే 7 నుంచి 11వ తేదీ వరకు టీఎస్ ఈఏపీసెట్ పరీక్షలు జరగనుండగా.. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి. మే 9,10,11 తేదీల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు నిర్వహిస్తారు.

ఈ ఏడాది ఈఏపీ సెట్‌కు మొత్తంగా దాదాపు 3.54 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగానికి 1,00,260 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఈఏపీసెట్ కన్వీనర్ డీన్ కుమార్ తెలిపారు. మిగితా వారందరూ ఇంజినీరింగ్ కు దరఖాస్తు చేశారని తెలిపారు.
గోరింటాకు, టాటూలు వేసుకోవద్దు
మరోవైపు, ఈఏపీసెట్ అభ్యర్థులకు ఉన్నత విద్యా మండలి కీలక సూచనలు చేసింది. ఈఏపీసెట్ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులు జేఎన్టీయూలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లోకి వాటర్ బాటిళ్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
అంతేగాక, చేతులకు గోరింటాకు, టాటూలు వంటి వాటిని పెట్టుకోకూడదని సూచించారు. విద్యార్థులు నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాల్సిందేనన్నారు. 90 నిమిషాల ముందునుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. గత కొన్నేళ్లుగా ఇంజినీరింగ్‌లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, గతంతో పోలిస్తే ఈసారి 20 కేంద్రాలు అదనంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒకే సమయంలో మరో పరీక్ష రాయాల్సి ఉంటే గనక.. ఆ విద్యార్థులు ముందుగా విజ్ఞప్తి చేసుకుంటే వారికి అనుకూలమైన తేదీలో పరీక్ష నిర్వహించేలా చూస్తామని ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు.
-
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
పదో తరగతి పరీక్షల వేళ విద్యార్ధులకు బిగ్ రిలీఫ్, విద్యా శాఖ కీలక సూచనలు..!! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్












Click it and Unblock the Notifications