TS GENCO : టిఎస్ జెన్‌కో ఉద్యోగాలకు రాతపరీక్ష డేట్ ఖరారు...
TS GENCO : తెలంగాణ జెన్‌కోలోని 339 ఉద్యోగాలకు రాత పరీక్ష తేదీని ఖరారు చేశారు. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలోని 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్ పోస్టులను ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు గత సంవత్సరం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 339 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. టిఎస్ జెన్‌కో పేర్కొన్న నోటిఫికేషన్ ప్రకారం నవంబర్ 10, 2023 తేదీతో ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ముగిసింది. ఈ పోస్టులకు సంబంధించిన రాతపరీక్ష తేదిని జెన్‌కో ప్రకటించింది. డిసెంబర్ 17, 2023 రాత పరీక్ష నిర్వహిస్తామని జెన్ కో వెల్లడించింది. అయితే వివిధ కారణాలతో ఈ పరీక్ష వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష తేదీలను యాజమాన్యం మరోసారి ప్రకటించింది.
టిఎస్ జెన్‌కో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షను మార్చి 31న హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు మూడు షిప్టులలో ఉండనున్నాయి. షిప్ట్ 1 ఉదయం 9.00 నుంచి 10.40 వరకూ ఉంటుంది. ఉదయం షిప్ట్‌లో మెకానికల్/ కెమిస్ట్ వారికి పరీక్షలు ఉండనున్నాయి. షిప్ట్2 మధ్యాహ్నం 1.00 నుంచి 2.40 వరకు ఉంటుంది. ఇందులో ఎలక్ట్రికల్ వారికి పరీక్ష ఉండనుంది. షిప్ట్3 సాయంత్రం 5.00 నుంచి 6.40 వరకు ఉంటుంది. ఇందులో సివిల్/ ఎలక్ట్రానిక్స్ వారికి పరీక్షలు ఉంటాయి. ఈ రాత పరీక్షలకు వారం రోజుల ముందే అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నారు. అంటే మార్చి 23న హాల్‌టికెట్లను విడుదల కానున్నాయి. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://tsgenco.co.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

తెలంగాణలో కొత్తగా నిర్మితమవుతున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలంగాణ జెన్‌కో వివరించింది. ఈ పోస్టులకు రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికయిన వారికి నెలకు రూ.65,600 నుంచి రూ.1,31,220 వరకు వేతనం చెల్లించడం జరుగుతుంది.
339 ఏఈ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి...
ఏఈ(ఎలక్ట్రికల్) పోస్టులు : 187
ఏఈ(మెకానికల్) పోస్టులు : 77
ఏఈ(ఎలక్ట్రానిక్స్) పోస్టులు : 25
ఏఈ(సివిల్) పోస్టులు : 50












Click it and Unblock the Notifications