TS : వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రిజల్ట్ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
తెలంగాణ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ విభాగంలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 22, 2022న ఈ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. గత సంవత్సరం జులైలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రాత పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ పరీక్షల ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరయిన విద్యార్థులు తమ వివరాలను టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో https://www.tspsc.gov.in/ చెక్ చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ విభాగంలో 170 పోస్టులు విడుదల కాగా, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ విభాగంలో 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ను సంప్రదించగలరు. మొత్తం 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల్లో కాస్ల్ ఏ, క్లాస్ బీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇందులో క్లాస్ ఏ విభాగంలో 170 పోస్టులు ఉండగా, క్లాస్ బీ విభాగంలో 15 పోస్టులున్నాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే గతేడాది జులై 13,14 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు జరిగాయి. జులై 13వ తేదిన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరగగా, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరిగాయి. తాజాగా ఆ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,220 - రూ.1,33,630 శాలరీ ఉంటుంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications