TSPSC: 113 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల కోసం అప్లై చేయండి
హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్(ఏఎంవీఐ) ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
రవాణాశాఖలో 113 ఏఎంవీఐ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి తెలిపారు.

అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సీఎం కేసీఆర్ గత అసెంబ్లీలో 80వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇప్పటికే గ్రూప్-1, పోలీసుశాఖతో పాటు వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications