తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్: 127 పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 5 మే 2021.
సంస్థ పేరు: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: సీనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు
పోస్టుల సంఖ్య: 127
జాబ్ లొకేషన్: తెలంగాణ
దరఖాస్తుకు చివరి తేదీ: 5 మే 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి డిప్లొమా, లేదా డిగ్రీలో ఉత్తీర్ణత
వయస్సు: 18 ఏళ్ల నుంచి 34 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది
అప్లికేషన్ ఫీజు:
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు : రూ.200/-
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు : రూ.80/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 12 ఏప్రిల్ 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 5 మే 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.tspsc.gov.in/












Click it and Unblock the Notifications