ఏవో, జేఏవో, ఎస్ఏఓ పరీక్షలకు హాల్ టికెట్లు విడుదల: ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌ అర్బన్ డెవలప్‌మెంట్‌ విభాగంలో భర్తీ చేయనున్న పలు పోస్టులకు నిర్వహించనున్న రాత పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్స్ పోస్టులకు సంబంధించిన హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఒక ప్రకటనలో వెల్లడించింది.

మొత్తం 78 పోస్టుల భర్తీకి ఈ రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. రాత పరీక్ష ఆగస్టు 8న కంప్యూటర్ ఆధారిత విధానం(సీబీటీ)లో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు వెబ్‌సైట్ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కమిషన్‌ సూచించింది.

హాల్ టికెట్ల డౌన్‌లోడ్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
https://hallticket.tspsc.gov.in/h3220220daf135d-7777-4f80-84fa-55600625dae3

TSPSC releases AO, JAO, SAO exam hall ticket: download here

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)కు నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 27న ఫలితాలు విడుదల చేయనున్నారు. రేపట్నుంచి అంటే ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

పేపర్‌-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు. బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్‌-2తోపాటు పేపర్‌-1 పరీక్ష కూడా రాసుకోవచ్చు. కాగా, ఇటీవల జరిగిన సమావేశంలో టెట్‌ నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ అధికారులు టెట్‌ నిర్వహణపై ప్రతిపాదనలు రూపొందించి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు అందజేశారు. ఆయా ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించగా.. టెట్‌ నిర్వహణపై అధికారులు కసరత్తు చేసి నోటిఫికేషన్‌ను రిలీజ్‌ చేశారు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 2
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 16

రాతపరీక్ష: సెప్టెంబర్‌ 15
పేపర్‌-1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
పేపర్‌-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు

పరీక్ష ఫీజు: రూ.400
దరఖాస్తు ఆన్‌లైన్‌లో దరాఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://tstet.cgg.gov.in ను సంప్రదించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+