TTD Jobs : టీటీడీలో ఉద్యోగాలు... జీతం రూ.61వేలు..

TTD Jobs : టీటీడీలో ఉద్యోగాలు... జీతం రూ.61వేలు..

49 డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు టీటీడి జాబ్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ కూడా ప్రారంభ‌మైంది. శాశ్వత ప్రాతిపదికన టీటీడీ డిగ్రీ కాలేజీలు/ ఓరియంటల్ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టుల‌కు అప్ల‌య్ చేయాల‌నుకునేవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూ మతానికి చెందిన వారు మాత్ర‌మే అయి ఉండాలి. ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో మాత్ర‌మే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 49 డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. మార్చి 7వ తేదీ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. మార్చి 27 వరకు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వీటితో పాటు జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ పోస్టులు కూడా నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది.

జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ పోస్టులు మొత్తం 29. ఈ పోస్టుల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ మార్చి 5వ తేదీ నుంచే ప్రారంభ‌మైంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు చివ‌రితేది మార్చి 25. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాల‌కోసం, ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.

TTD Jobs Jobs in TTD Salary Rs 61 thousand

డిఎల్ పోస్టులు మొత్తం .. 49

సబ్జెక్టుల వారీగా ఖాళీల వివ‌రాలివే.

బోటనీ- 3,
కెమిస్ట్రీ- 2,
కామర్స్- 9,
డెయిరీ సైన్స్- 1,
ఎలక్ట్రానిక్స్- 1,
ఇంగ్లిష్- 8,
హిందీ- 2,
హిస్టరీ- 1,
హోమ్ సైన్స్- 4,
ఫిజికల్ ఎడ్యుకేషన్- 2,
ఫిజిక్స్- 2,
పాపులేషన్ స్టడీస్- 1,
సంస్కృతం- 1,
సంస్కృత వ్యాకరణం- 1,
స్టాటిస్టిక్స్- 4,
తెలుగు- 3,
జువాలజీ- 4 పోస్టులున్నాయి.

ఇత‌ర వివ‌రాలు ఇలా ఉన్నాయి...

విద్యార్హ‌త : కనీసం 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నెట్‌/ స్లెట్‌ అర్హత సాధించి ఉండాలి.
వ‌య‌సు : 01-07-2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు అయిదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు వ‌ర్తిస్తుంది.
నెల‌వారి వేత‌న వివ‌రాలు : నెలకు డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు రూ.61,960- రూ.1,51,370 వేత‌నంగా ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయ‌డం జ‌రుగుతుంది.
ఫీజు వివ‌రాలు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250.. ఇతరులకు రూ.370గా ప‌రిణించారు.
అప్ల‌య్ చేయు విధానం : ఆన్‌లైన్‌లో మాత్ర‌మే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు తేదీలు : డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు మార్చి 7 నుంచి మార్చి 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+