యూజీసీ నెట్ 2024 ఫలితాలు విడుదల: స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
దేశ వ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న యూజీసీ నెట్ (జూన్) 2024 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 5 వరకు మొత్తం 83 సబ్జెక్టులకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఎన్టీఏ వెల్లడించింది. అక్టోబర్ 10న ఫైనల్ కీ విడుదల చేసిన విషయం తెలిసిందే.
యూజీసీ నెట్‌కు దేశ వ్యాప్తంగా 11,21,225 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్లు చేసుకోగా.. 6.84 లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో 4970 మంది జేఆర్ఎఫ్ కు అర్హత సాధించారు. 53,694 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు, 1,12,070 మంది పీహెచ్‌డీకి క్వాలిఫై అయ్యారు.

దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్‌డీల్లో ప్రవేశాల కోసం ఏటా రెండుసార్లు జూన్, డిసెంబర్ నెలల్లో యూజీసీ నెట్ పరీక్షను ఎన్టీఏ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, జూన్ నెలలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఫలితాలను వెల్లడించింది.
తాజాగా విడుదలైన యూజీసీ నెట్ స్కోర్ కార్డులను తమ అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.ac.in/ లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ స్కోరు కార్డును డౌన్ లోడ్ చేసుకునేందుకు ఈ లింక్ https://ugcnet.ntaonline.in/frontend/web/scorecard/ugc-final-score-card2024 పై క్లిక్ చేయండి.
స్కోర్‌కార్డ్‌లను డౌన్‌లోడ్ చేయడానికి, దరఖాస్తుదారులు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించాల్సి ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్, JRF, PhD అడ్మిషన్ల కోసం UGC NET జూన్ రీ-టెస్ట్ ఆగస్టు-సెప్టెంబర్, 2024లో జరిగింది.
UGC నెట్ ఫలితాలను 2024 డౌన్‌లోడ్ చేయండిలా..:
అధికారిక వెబ్‌సైట్, ugcnet.nta.ac.inని సందర్శించండి
హోమ్ పేజీలో ఇచ్చిన UGC NET స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ లింక్‌ను తెరవండి
మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి - అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ
మీ వివరాలను సమర్పించండి, మీ ఫలితాన్ని తనిఖీ చేయండి
దీన్ని డౌన్‌లోడ్ చేసి, భవిష్యత్తు సూచన కోసం ప్రింట్‌అవుట్ తీసుకోండి.












Click it and Unblock the Notifications